అన్వేషించండి
IT Raid at Hero Aryas Residence: హీరో ఆర్య నివాసంలో ఐటీ దాడులు!
IT Raid at Hero Aryas Residence: తమిళ్ హీరో ఆర్య నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు జూన్ 18 బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు...
IT raid at actor Arya residence
1/6

చెన్నైలో "సీ షెల్" రెస్టారెంట్లపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రెస్టారెంట్ చైన్ తో గతంలో సంబంధాలున్న హీరో ఆర్య నివాసంపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు
2/6

అన్నా నగర్, వేలచ్చేరి సహా నగరంలోని పలు "సీ షెల్" రెస్టారెంట్ శాఖల్లో జూన్ 18 బుధవారం ఉదయం నుంచీ తనిఖీలు కొనసాగుతున్నాయ్. సేమ్ టైమ్ పూనమల్లి హై రోడ్ లో ఉన్న ఆర్య నివాసంలోనూ ఐటీ బృందం సోదాలు చేపట్టింది.
3/6

గతంలో ఆర్య ఈ అరేబియన్ రెస్టారెంట్ చైన్ ను ప్రారంభించాడు.ఆతర్వాత కొన్నాళ్లకు కేరళకు చెందిన కున్హి మూసా అనే బిజినెస్ మెన్ కు విక్రయించాడనే వార్తలొచ్చాయి.
4/6

కేరళలో కున్హి మూసాకు సంబంధించిన ప్రాపర్టీస్ పై ఐటీ అధికారులు నిఘా పెట్టారు...ఆ విచారణలో భాగంగానే చెన్నైలో ఈ రెస్టారెంట్లు, ఆర్య నివాసంపై దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది
5/6

రెస్టారెంట్ ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య మార్పులకు సంబంధించిన అంశాలపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
6/6

ఆర్య కేరళకు చెందిన వ్యక్తి అయినప్పటికీ "అరిన్తుమ్ అరియామలుమ్" సినిమాతో తమిళ మూవీస్ తో హీరోగా క్లిక్కయ్యాడు. ప్రస్తుతం ఆర్య "వెట్టువమ్" సినిమాలో నటిస్తున్నాడు. పా.రంజిత్ దర్శకుడు.
Published at : 18 Jun 2025 01:49 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















