అన్వేషించండి
IRCTC Whatsapp Service: రైల్లో భోజనం ఆర్డరివ్వాలా! ఈ వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేస్తే బెర్త్ దగ్గరకే డెలివరీ!
IRCTC Whatsapp Service: రైల్లో భోజనం ఆర్డరివ్వాలా! ఈ వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేస్తే బెర్త్ దగ్గరకే డెలివరీ!
ఐఆర్‌సీటీసీ వాట్సాప్ సేవలు
1/5

భారతీయ రైల్వే రోజురోజుకీ సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అత్యంత వేగంగా ఆన్‌లైన్ సేవలకు అప్‌గ్రేడ్ అవుతోంది. ఒకప్పుడు భారీ వరుసల్లో నిలబడి టికెట్లు తీసుకొనే ప్రయాణికులు ఇప్పుడు చక్కగా మొబైల్లోనే బుక్ చేసుకుంటున్నారు.
2/5

సాధారణంగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు భోజన సదుపాయాలన్నీ ఐర్‌సీటీసీ చూసుకుంటుంది. ప్రస్తుతం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే భోజనం ఆర్డరిచ్చే సదుపాయం ఉంది. అయితే వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉండేది.
3/5

ఇకపై ఈ ఇబ్బందులకు ఐఆర్‌సీటీసీ చెక్ పెట్టనుంది. ప్రయాణికులకు సత్వరమే కోరుకున్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. వాట్సాప్ ద్వారా భోజనాలకు ఆర్డరిచ్చే సదుపాయం కల్పిస్తోంది. ఇది రెండు దశల్లో అమలవ్వనుంది.
4/5

మొదటి దశలో ప్రయాణికులు ఈ-టికెట్ బుక్ చేసుకున్నప్పుడే వాట్సాప్‌కు ఓ సందేశం వస్తుంది. http://www.ecatering.irctc.co.in లింక్ వస్తుంది. దానిని క్లిక్ చేసి ఈ-క్యాటరింగ్ సేవలను ఎంచుకోవచ్చు. ఐఆర్‌సీటీసీలో నేరుగా భోజనాలను బుక్ చేసుకోవచ్చు.
5/5

రెండో దశలో భోజనం కోసం 8750001323 వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. అందులో ఆర్డర్ ఇస్తే మీ బెర్త్ దగ్గరకే డెలివరీ చేస్తారు. ఈ-క్యాటరింగ్ సేవలపై ఉన్న సందేహాలను తీర్చేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను ఉపయోగిస్తారని తెలిసింది.
Published at : 06 Feb 2023 06:05 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
విశాఖపట్నం
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















