అన్వేషించండి
Money From Facebook : ఫేస్బుక్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసా? ఇంట్లో కూర్చొనే ఎర్న్ చేసేయండిలా
Earning Money from Facebook : ఫేస్బుక్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. స్నేహితులతో కనెక్ట్ అవ్వడమే కాకుండా.. ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఇది బెస్ట్ ప్లాట్‌ఫారమ్.
ఫేస్బుక్ నుంచి డబ్బులు ఇలా సంపాదించేయండి
1/7

Facebook కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు. ఇది డిజిటల్ మార్కెట్‌ప్లేస్. కొన్నేళ్లుగా కంటెంట్ క్రియేషన్ హబ్‌గా మారింది. ఇక్కడ ప్రతి వినియోగదారుడు తమ అభిరుచి, ప్రతిభకు అనుగుణంగా డబ్బు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి.
2/7

మీకు వీడియోలు చేయడం, మోటివేషనల్ కంటెంట్, టెక్ రివ్యూలు, వంట, ప్రయాణం లేదా ఫన్నీ వీడియోలు వంటి ప్రత్యేక ప్రతిభ ఉంటే.. మీరు Facebook పేజీలో వాటిని షేర్ చేయవచ్చు. పేజీలో మంచి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటే ఫాలోవర్లు పెరుగుతారు. దీనివల్ల మీరు Facebook భాగస్వామ్య ప్రోగ్రామ్స్‌లో భాగం అవుతారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వీడియోలలో వచ్చే ప్రకటనల నుంచి మీకు ఆదాయం వస్తుంది.
3/7

ఈ మధ్య ఫేస్బుక్ రీల్స్‌పై దృష్టి పెట్టింది. చిన్న, ఆకర్షణీయమైన వీడియోలు చేసి లక్షలాది మందికి రీచ్ అయ్యేలా చేయవచ్చు. ఫేస్బుక్ రీల్స్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా క్రియేటర్స్ వారి వీడియోలకు వచ్చే వ్యూస్, ప్రకటనల ఆధారంగా డబ్బులు పొందుతారు. మీ కంటెంట్ లో సృజనాత్మకత, ప్రత్యేకత ఉంటే మీరు కూడా ఆదాయం సంపాదించవచ్చు.
4/7

ఫేస్బుక్లో సంపాదించడానికి మరో సులభమైన మార్గం మార్కెటింగ్. ఇందులో మీరు ఏదైనా కంపెనీ లేదా ఈ-కామర్స్ సైట్ ఉత్పత్తి లింక్ షేర్ చేయాలి. మీ లింక్ ద్వారా ఎవరైనా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు మీకు కమీషన్ లభిస్తుంది. మార్కెటింగ్, ప్రమోషన్లో నైపుణ్యం ఉండే వారికి ఇది బెస్ట్.
5/7

మీరు హ్యాండ్‌మేడ్ వస్తువులు, బట్టలు, బహుమతులు లేదా ఏమైనా అమ్మాలనుకుంటే Facebook Marketplace మంచి వేదిక అవుతుంది. ఇక్కడ మీరు మీ ఉత్పత్తులను జాబితా చేసి నేరుగా వారికి విక్రయించవచ్చు.
6/7

మీ పేజీ లేదా ప్రొఫైల్‌లో ఫాలోవర్లు పెరిగే కొద్దీ.. బ్రాండ్లు మిమ్మల్ని సంప్రదించడం ప్రారంభిస్తాయి. కంపెనీలు మీ ద్వారా వారి ఉత్పత్తులు లేదా సేవల గురించి ప్రచారం చేయిస్తాయి. దీనికి ప్రతిఫలంగా మీకు మంచి మొత్తంలో డబ్బులు వస్తాయి.
7/7

ఫేస్బుక్ ద్వారా సంపాదించడం పెద్ద కష్టం కాదు. కంటెంట్ క్రియేటర్ అయినా, మార్కెటింగ్ నిపుణులైనా లేదా చిన్న వ్యాపారం చేసే వారైనా సరైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తే కచ్చితంగా మీరు సోషల్ మీడియా ద్వారా సంపాదన ప్రారంభించ గలుగుతారు.
Published at : 28 Aug 2025 08:10 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















