అన్వేషించండి

Amazon: ఐ ఫోన్‌ ఆర్డరిస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ - అమెజాన్‌ను కోర్టుకు లాగిన కర్నూలు వాసి !

Kurnool: ఐఫోన్ ఆర్డర్‌కు బదులు IQ ఫోన్ డెలివరీ చేయడంతో కర్నూలు వాసి కోర్టుకెళ్లారు. దీంతో అమెజాన్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

Non bailable warrant for Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌పై కర్నూల్ జిల్లా కన్స్యూమర్ ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. ఆన్‌లైన్‌లో ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేసిన బాధితుడికి బదులుగా IQ ఫోన్ డెలివరీ చేసినందుకు, అమెజాన్ సంస్థకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బాధితుడికి రూ.80 వేలు రిఫండ్ చేసి, అదనంగా రూ.25 వేలు చెల్లించాలని ఆదేశించిన ఫోరం, సంస్థ ఆదేశాలను పాటించకపోవడంతో ఈ చర్య తీసుకుంది.  
 
కర్నూల్ జిల్లాకు చెందిన వీరేష్ అనే వ్యక్తి అమెజాన్ వెబ్‌సైట్‌లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీలో ఐఫోన్‌కు బదులుగా IQ బ్రాండ్ ఫోన్ వచ్చింది. ఈ తప్పుడు డెలివరీపై బాధితుడు అమెజాన్ కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించాడు. అక్కడ సరైన స్పందన లభించకపోవడంతో, వినియోగదారుల హక్కుల రక్షణ కోసం కర్నూల్ జిల్లా కన్స్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించాడు.  
 
కన్స్యూమర్ ఫోరం బాధితుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టింది. విచారణలో అమెజాన్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో, ఫోరం బాధితుడికి ఐఫోన్ 15 ప్లస్ డెలివరీ చేయాలని లేదా రూ.80 వేలు రిఫండ్ చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా, మానసిక వేదన ,  సమయం వృధా చేసినందుకు అదనంగా రూ.25 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే, అమెజాన్ సంస్థ ఈ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో, బాధితుడు మరోసారి ఫోరాన్ని సంప్రదించాడు.

ఫోరం అమెజాన్ సంస్థకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇది సంస్థకు భారీ షాక్‌గా మారింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసిన ఫోరం, అమెజాన్ ప్రతినిధులు హాజరు కావాలని ఆదేశించింది. ఈ వారెంట్ జారీతో అమెజాన్ సంస్థ ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడింది.
 
ఆన్‌లైన్ కొనుగోళ్లలో వస్తువుల మార్పిడి, తప్పుడు డెలివరీలు పెరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న సమయంలో ఈ తీర్పు ఇతర బాధితులకు ప్రేరణగా  నిలుస్తోంది. అమెజాన్ సంస్థ నుంచి ఇంతవరకు అధికారిక ప్రతిస్పందన రాలేదు, కానీ నవంబర్ 21 విచారణలో సంస్థ ప్రతినిధులు హాజరై ఆదేశాలను అమలు చేయాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget