CM Chandrababu in Dubai: దుబాయ్‌లో అడుగు పెట్టిన వెంటనే ఏపీ సీఎం వరుస సమావేశాలు - విశాఖ పెట్టుబడుల సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపులు
AP CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సమావేశాలకోసం దుబాయ్ వెళ్లారు. ఎంబసీ అధికారులతో పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు.

Chandrababu Naidu meetings with industrialists in Dubai: ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్ తో సమావేశం అయ్యారు. రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి విరాళాన్ని శోభా గ్రూప్ గతంలో ప్రకటించారు. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించటంపై ప్రత్యేకంగా అభినందించారు.
పీ4లో విధానంలో జీరో పావర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు వివరించారు. అమరావతి రాజధాని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని.. రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టి సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని పీఎన్సీ మీనన్‌ను సీఎం కోరారు. శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఏపీ అని వివరించారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు లాంటి మౌలిక సదుపాయాలు సిద్ధం అవుతాయని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని గుర్తు చేశారు.
ఏపీలోని తిరుపతి, విశాఖ, అమరావతి లాంటి నగరాలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలను.. కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు గుర్తు చేసిన శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్ పలు అంశాలపై మాట్లాడారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. దుబాయ్‌కు వచ్చిన వెంటనే చంద్రబాబు ఎంబసీ అధికారులతో సమావేశం అయ్యారు.
Hon’ble CM Shri N. Chandrababu Naidu Garu met with officials of the Indian Embassy in Dubai today.@ncbn @IndembAbuDhabi pic.twitter.com/grypOMU4gi
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 22, 2025
అంతకు ముందు దుబాయ్ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటన కోసం నేడు దుబాయ్ చేరుకున్నారు. స్థానిక తెలుగు ప్రజలు ఆయన కు ఘన స్వాగతం పలికారు. అబుదాబి ఇండియన్ ఎంబసీ డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ శ్రీ అమర్ నాధ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ శ్రీ సతీష్ కుమార్ శివన్‌లతో కాసేపట్లో… pic.twitter.com/ODQMvkmRyS
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 22, 2025
మూడు రోజుల చంద్రబాబు దుబాయ్, యూఏఐల్లో పర్యటిస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో మూడు, పారిశ్రామిక వేత్తలతో 14 వన్ టు వన్, రౌండ్ టేబుల్ మీటింగ్స్, రెండు సైట్ విజిట్స్, సీఐఐ పీఎస్ రోడ్ షో 1, తెలుగు డయాస్పోరా 1, మీడియా ఇంటర్వ్యూలు సహా తన పర్యటనలో చంద్రబాబు 25 సమావేశాల్లో పాల్గొననున్నారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.





















