Amaravati Banks: అమరావతిలో 12 బ్యాంకుల ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు - 28న నిర్మలా సీతారామన్ శంకుస్థాపన
Amaravati: అమరావతిలో 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన 28వ తేదీన జరగనుంది. నిర్మలా సీతారామన్‌తో పాటు ఆర్బీఐ గవర్నర్ హాజరు కానున్నారు.

12 banks state headquarters in Amaravati: ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు తరలి వస్తున్నాయి. 28వ తేదీన రాష్ట్ర స్థాయి బ్యాంకుల ప్రధాన కార్యలయాల శంకుస్థాపన జరగనుంది. 12 ప్రముఖ బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్బీఐ గవర్నర్, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గత నెలలోనే శంకుస్థాపనలు చేయాలనుకున్నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడింది
ఉద్దండరాయునిపాలెం వద్ద బ్యాంకులకు స్థలాలు కేటాయించారు. ఇప్పటికే ఆ స్థలాలను ఆయా బ్యాంకులు చదును చేసుకున్నాయి. ప్లాన్లు రెడీ చేసుకున్నాయి. సభా వేదికపై నుంచి ఒకేసారి అన్ని 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2014-19 మధ్యలోనే బ్యాంకులకు స్థలాలు కేటాయించారు. కానీ ప్రభుత్వం మారడంతో బ్యాంకులు నిర్మాణాలు చేయలేదు. స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపించలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు 3 ఎకరాలు కేటాయించారు. ఎస్బీఐ ఇక్కడ 14 అంతస్తులు భవనం నిర్మిస్తోంది. కెనరా బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనాల నిర్మాణం ఒకే సారి ప్రారంభంకానుంది. ఈ భవనాల్లోనే రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర స్థాయి కార్యలయాలు విజయవాడ నుంచి నడుస్తున్నాయి.
🏦 12 Banks will lay foundation for "Regional Offices" in #Amaravati at grand ceremony conducted by Govt of #AndhraPradesh
— Andhra & Amaravati Updates (@AP_CRDANews) September 29, 2025
🔹SBI will build 14 Floors (1 Lac Sft) Building
🔹AP Grameena Bank will build its HQ in 2 acres alloted#InvestInAP #APCRDA #AmaravatiRising pic.twitter.com/sFWs5tkmke
ఈ శంకుస్థాపన అమరావతి పునర్నిర్మాణంలో భాగం. ఇ ప్రధాని నరేంద్ర మోదీ రూ.58 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ బ్యాంకుల ప్రాజెక్టు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన పనులను నిరంతరాయంగా సాగుతున్నాయి. అదే సమయంలో ప్రైవేటు సంస్థలు కూడా తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నాయి. దీంతో అమరావతిలో 12వేల మంది కార్మికులు వివిద సైట్ల వద్ద పని చేస్తున్నారు.





















