అన్వేషించండి
Horoscope Today 15th December 2022: ఈ రాశివారు షార్ట్ టెంపర్ తగ్గించుకుంటే మంచిది
Horoscope Today 15th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 15th December 2022
1/9

మేష రాశి: ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. నూనె పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాయామం చేయండి. ఇంటి సౌకర్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేయవద్దు. తండ్రి మొరటు ప్రవర్తన మీకు కోపం తెప్పించవచ్చు. కానీ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
2/9

వృషభ రాశి : జీవితంలోని అన్ని క్లిష్ట పరిస్థితులలోనూ మీకు కన్నవారి సహాయం ఉంటుంది. రోజు కాస్త నిరాశగా ప్రారంభమైనా నెమ్మదిగా ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
3/9

మిథున రాశి: క్షణికావేశం వివాదాలకు, దుష్టత్వానికి కారణమవుతుంది. అవసరమైన దానికంటే ఎక్కువ సమయం వినోదం కోసం వెచ్చించకండి. మీ దగ్గరి కుటుంబ సభ్యులు మీకు కోపం, అసహనం కలిగేలా చేస్తారు. వాదనకు లేదా తగాదాలకు దిగకుండా ప్రశాంతంగా మీ భావాలను వ్యక్తీకరించండి.
4/9

కర్కాటక రాశి : ఈ రోజు అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు మీ ఆహారంపై నియంత్రణ కలిగి ఉండం మంచిది.
5/9

సింహ రాశి: మీ సంకల్ప శక్తికి ప్రత్సాహం ఉంటుంది. చాలా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. భావోద్వేగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ హేతుబద్ధతను వదులుకోవద్దు. తొందరపడి పెట్టుబడి పెట్టడం సరికాదు. సాధ్యమైన అన్ని కోణాల్లో పరిశీలించి ముందడుగు వేయడం మంచిది.
6/9

మకర రాశి : ఈ రోజు మీరు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ముందడుగు వేయడం ద్వారా అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. భావసారూప్యత కలిగిన వ్యక్తితో సమయం గడపడం సంతృప్తికరంగా ఉంటుంది.
7/9

మీన రాశి: ఈ రోజు మీరు సానుకూల శక్తితో నిండి ఉంటారు. ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. మీ సొంత పని నుంచి సమయం కేటాయించడం ద్వారా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం సాధ్యం కాదు. మీరు ప్రయత్నిస్తే మీ ప్రియమైనవారికి దగ్గరవ్వడం సులభం అవుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
8/9

కుంభ రాశి: మానసికంగా ఏదో ఇబ్బందిలో ఉంటారు. ఆర్థిక సమస్యల కారణంగా మీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది..కొన్ని చర్చల్లో పాల్గొంటారు. మీ నుంచి ఎక్కువగా ఆశించే వ్యక్తులకు 'లేదు' అని చెప్పడానికి సిద్ధంగా ఉండండి.
9/9

ధనుస్సు రాశి : ప్రతికూల ఆలోచనలు మానసిక అనారోగ్యంగా మారడం కన్నా ముందే వాటిని తొలగించడం మంచిది. దాతృత్వ వ్యవహారాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ సృజనాత్మక ప్రతిభను సరిగ్గా ఉపయోగిస్తే చాలా ప్రయోజనం పొందుతారు.
Published at : 14 Dec 2022 08:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
సినిమా
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















