అన్వేషించండి
బుధుడి రాశి మార్పు మేషం, మిథునం సహా ఈ రాశువారికి ఆర్థిక లాభం - కొత్త అవకాశాలు!
Budh Gochar 2025 in Kanya Rashi: కన్యారాశిలో బుధుడు సెప్టెంబర్ 15న ప్రవేశించాడు. భద్ర రాజయోగం ఏర్పడుతుంది, ఇది ఈ రాశుల వారికి లాభదాయకం.
Budh Gochar 2025 in kanya rashi
1/6

బుధ గ్రహాన్ని వ్యాపార కారకంగా భావిస్తారు. బుధుడి కదలికలో మార్పు ఉద్యోగం-వ్యాపారంపై నేరుగా ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ 15న బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఫలితంగా ఈ రాశులవారికి వ్యాపారంలో లాభం కలుగుతుంది
2/6

కన్యా రాశి బుధుడికి సొంత రాశి. ఈ సంచారం చాలా రాశుల వ్యాపారులకు, సామాన్య ప్రజలకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని రాశులకు ఈ సంచారం వల్ల ధనం, వ్యాపారం, విజయం లభిస్తాయి.
3/6

మేష రాశి మీ రాశిలో బుధుని సంచారం ఆరవ స్థానంలో జరిగింది, దీనివల్ల కెరీర్-వ్యాపారానికి ఒక బంగారు దిశ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు ఈ కాలంలో చాలా లాభం పొందుతారు.
4/6

మిథున రాశి మీ రాశి నుంచి నాల్గవ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో సంతాన సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి , వ్యాపారంలో లాభం ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో ఈ సమయం మంచిది.
5/6

సింహ రాశి నుంచి రెండవ స్థానంలో బుధుడు సంచరించడం వలన మీరు ధనం సంపాదించడమే కాకుండా ధనాన్ని పొదుపు చేసుకునే అవకాశాన్ని కూడా పొందుతారు. వ్యాపారపరమైన ప్రయాణాలు విజయవంతమవుతాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది.
6/6

ధనుస్సు ..మీ రాశి నుంచి పదవ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల మీరు పని చేసే చోట పేరు తెచ్చుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీరు పని చేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక విషయాలకు ఇది మంచి సమయం.
Published at : 16 Sep 2025 06:00 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
జాబ్స్
పాలిటిక్స్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















