శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మంగళవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.
మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు.
ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక.
పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం.
ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.
శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
శ్రీవారి స్నపన తిరుమంజనంలో శ్రీమలయప్పస్వామివారిని స్పృశించే అవకాశం చందనం, పిస్తా - ఏలకులు మాలలకు దక్కింది.
మంగళవారం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది..
TTD News: తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ అధికారులు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం
ఫోటోలు: తామర, తులసి గింజలతో శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం
In Pics: తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఫోటోలు మీరూ చూసేయండి
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
/body>