అన్వేషించండి
YS Jagan Bus Yatra: జగన్ బస్సు యాత్రలో అవే హైలెట్, చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ముద్దాడిన సీఎం
AP News Latest: పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా జగన్ ను చూసేందుకు భారీ ఎత్తున జనం పోటెత్తారు.

జగన్ బస్సు యాత్ర
1/16

పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది.
2/16

12వ రోజు బస్సు యాత్ర గంటావారిపాలెం నుంచి ప్రారంభం అయింది. నిన్న రాత్రి జగన్ అక్కడే బస చేశారు.
3/16

గంటావారి పాలెం నుంచి సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల, విప్పెర్ల, నెకరికల్లు, దేవరంపాడు క్రాస్, కొండమోడు మీదుగా సాగింది.
4/16

బస్సు యాత్ర సాగుతున్న మార్గంలో జగన్ ను చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు జనం హాజరయ్యారు.
5/16

పలు చోట్ల గజమాలలతో స్వాగతం పలికారు. బస్సుపై నిలబడి జగన్ అభివాదం చేస్తుండగా భారీ క్రేన్లతో గజమాలలను సిద్ధం చేశారు.
6/16

అన్నవరప్పాడు వద్ద గుమ్మడికాయలతో కొందరు మహిళలు దిష్టి తీశారు.
7/16

స్కూల్ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
8/16

గంటావారిపాలెం రాత్రి బస వద్ద సీఎం జగన్ సమక్షంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు కొంత మంది వైసీపీలో చేరారు.
9/16

విజయవాడ వెస్ట్ కు చెందిన జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో జగన్ సమక్షంలోనే చేరారు.
10/16

కొంత మంది రోజు కూలీలు, కార్మికులు, గృహిణులు, స్కూలు పిల్లలు, కాలేజీ యువతులు సీఎం జగన్ ను కలిశారు.
11/16

అవ్వా తాతలను సీఎం జగన్ ప్రేమతో ముద్దాడారు.
12/16

తన బస్సు ద్వారం వద్ద మెట్లపై కూర్చొని తనను చూసేందుకు వచ్చిన వారితో సంభాషించారు.
13/16

పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను సీఎం జగన్ పలకరించారు.
14/16

సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొండమోడు జంక్షన్ వద్దకు చేరుకుంది.
15/16

ఉదయం నుంచి తీక్షణమైన ఎండ కాస్తున్నా జన సందోహం ఆగలేదు.
16/16

ఎక్కడికక్కడ సీఎం జగన్‌కు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
Published at : 10 Apr 2024 05:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion