Ramdev Baba Apologies: 'అలాంటి ఉద్దేశం నాకు లేదు'- ఆ వ్యాఖ్యలపై బాబా రాందేవ్ క్షమాపణలు
Ramdev Baba Apologies: మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు.
Ramdev Baba Apologies: మహిళలపై యోగా గురువు బాబా రాందేవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఆయన క్షమాపణలు కోరారు. మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని రాందేవ్ అన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు తనను క్షమించాలని కోరారు.
నోటీసులు
దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ రాందేవ్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు.
बाबा रामदेव उर्फ राम किसन यादव यांनी ठाणे येथील एका सार्वजानिक कार्यक्रमात महिलांसंबंधी अत्यंत खालच्या पातळीवर जाऊन विधान केले होते. या वक्तव्याची राज्य महिला आयोगाने गंभीर दखल घेत बाबा रामदेव उर्फ राम किसन यादव यांना याबाबतीत आपला खुलासा दोन दिवसाच्या आत सादर करण्यासाठी नोटिस१/२ pic.twitter.com/umI27luSK7
— Rupali Chakankar (@ChakankarSpeaks) November 28, 2022
ఇదీ జరిగింది
మహారాష్ట్రలోని ఠానెలో మహిళల కోసం గత వారం ఓ యోగా సైన్స్ క్యాంప్ నిర్వహించారు బాబా రాం దేవ్. ఆ సమయంలో అందరూ సల్వార్ సూట్‌లతో వచ్చారు. దీనిపై స్పందించిన రామ్ దేవ్ బాబా "మరే ఇబ్బంది లేదు. మీరు ఇంటికి వెళ్లి చీరలు కట్టుకోవచ్చు" అని అన్నారు. అంతటితో ఆగకుండా రాందేవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
In #Thane, #Maharashtra, #BabaRamdev said, 'There was no time to wear saree, no problem, now go home and wear saree, women like to wear saree. Women also look good in salwar suits and like me they look good "without wearing anything".#Patanjali #BharatJodaYatra pic.twitter.com/lhCcq0IpNp
— #BharatJodoYatra🇮🇳🇮🇳 (@IamMitesh86) November 25, 2022
"మహిళలు చీరలు కట్టుకున్నా అందంగా ఉంటారు. సల్వార్ వేసుకున్నా బాగానే కనిపిస్తారు. నా కళ్లకైతే...వాళ్లు ఏమీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు" అని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ కూడా ఉన్నారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలతో షాక్ అయిన ఆమె...ఆ అసహనాన్ని బయట పెట్టకుండా అలా నవ్వుతూ ఊరుకున్నారు. ఆమెతో పాటు అక్కడ సీఎం ఏక్‌నాథ్ శిందే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ శిందే కూడా అక్కడే ఉన్నారు.
Also Read: Watch Video: అదే పనిగా టీవీ చూస్తోన్న చిన్నారి- వింత శిక్ష వేసిన తల్లిదండ్రులు!