Worlds Most Admired Men 2021: ప్రధాని మోదీ మరో రికార్డ్ .. బైడెన్, పుతిన్‌ను దాటి టాప్-10లో చోటు
వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్‌డ్ మెన్ లిస్ట్ 2021 జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 8వ స్థానాన్ని దక్కించుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరోసారి బయటపడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రశంసనీయ వ్యక్తుల జాబితా (వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్‌డ్ మెన్ లిస్ట్) 2021లో టాప్-10లో మోదీకి చోటుదక్కింది. డేటా ఎనలిటిక్స్ కంపెనీ YouGov చేసిన సర్వే ఆధారంగా ఈ జాబితాను తయారు చేశారు.
8వ స్థానంలో..
ఈ జాబితాలో ప్రధాని మోదీ 8వ స్థానం దక్కించుకున్నారు. ప్రపంచలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా పేరొందిన మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వెనక్కి నెట్టి మెరుగైన స్థానం అందుకున్నారు.
మరి కొంతమంది..
ఈ జాబితాలో మరి కొంతమంది భారతీయ ప్రముఖులు టాప్-20లో ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ టాప్- 20లో నిలిచారు.
టాప్-3..
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్థానం దక్కించుకున్నారు. అమెరికా బిజినెస్ మ్యాన్ బిల్‌గేట్స్ రెండో స్థానం పొందారు.
టాప్-10 ఇవే..
- బరాక్ ఒబామా
- బిల్ గేట్స్
- షీ జిన్‌పింగ్
- క్రిస్టియానో రొనాల్డో
- జాకీ చాన్
- ఎలాన్ మస్క్
- లియోనెల్ మెస్సీ
- నరేంద్ర మోదీ
- వ్లాదిమిర్ పుతిన్
- జాక్ మా
మహిళల్లో..
దీంతో పాటు మోస్ట్ అడ్మైర్‌డ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాను కూడా YouGov విడుదల చేసింది. అమెరికా మాజీ మొదటి మహిళ మిచెల్ ఒబామా అగ్రస్థానాన్ని సంపాదించారు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో నటి ఏంజెలినీ జోలీ, క్వీన్ ఎలిజిబెత్ 2 ఉన్నారు.
Also Read: Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి
Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి