Cyber Kidnap: సైబర్ కిడ్నాప్ అంటే తెలుసా? ఇప్పుడు ఇది కొత్త రకం కిడ్నాప్!
Cyber Kidnapping Latest News: సైబర్ నేరాల్లో కొత్తగా సైబర్ కిడ్నాపింగ్ అనే క్రైం చేరింది. ఇటీవల అమెరికాలో ఈ సైబర్ కిడ్నాపింగ్ కేసు ఒకటి వెలుగు చూసింది.
What is Cyber Kidnapping? కిడ్నాప్ అంటే ఒక వ్యక్తిని ఎవరూ తెలియని ప్రదేశంలో బంధించి.. డబ్బులు డిమాండ్ చేయడం. నేటి సైబర్ యుగంలో కిడ్నాపింగ్ స్టైల్ మారింది. సైబర్ నేరాల్లో కొత్తగా సైబర్ కిడ్నాపింగ్ అనే క్రైం చేరింది. ఇటీవల అమెరికాలో ఈ సైబర్ కిడ్నాపింగ్ కేసు ఒకటి వెలుగు చూసింది.
అమెరికాలో జరిగిన సైబర్ కిడ్నాపింగ్..
స్టూడెంట్స్ ఏక్సెంజ్ విధానంలో భాగంగా అమెరికా వచ్చి చదువుకుటుంన్న ఓ చైనీస్ విద్యార్థి సైబర్ కిడ్నాపింగ్ కు గురయ్యాడు. దీనికి పాల్పడిన సైబర్ నేరస్థులు ఆ విద్యార్థి తల్లిదండ్రుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు సూలు చేశారు.
సైబర్ కిడ్నాపింగ్ ఎలా జరిగింది?
చైనాకు చెందిన కై జువాంగ్ అనే 17 ఏళ్ల విద్యార్థి ఎక్సెంజ్ విధానంలో భాగంగా అమెరికాలోని ఉటా అనే ప్రాంతానికి చెందిన రివర్ డెల్ లో చదువుతున్నాడు. అతను తప్పిపోయినట్లు వారం క్రితం ఫిర్యాదు అందింది. అక్కడి పోలీసులు జువాంగ్ ను ఎవరో బలవంతంగా ఎత్తుకెళ్లారని తమ ప్రాథమిక దర్యాప్తులో భావించారు. అయితే బ్రిగ్ హామ్ సిటీలో రివర్ డెల్ కు 40 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా కనపించాడు. దీంతో అక్కడి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అతణ్ని విచారిస్తే.. తన కుటుంబానికి ప్రమాదం ఉందని సమాచారం వచ్చిందని, వారికి బెదిరింపులు వస్తున్నాయి. ఇలా ఒంటరిగా బంధించుకోవాల్సి ఉందని కై జువాంగ్ పోలీసులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అతను చెప్తున్న విషయాలను పోలీసులు నమ్మలేదు. చివరకు పూర్తి దర్యాప్తులో తేలిందేంటంటే నిజంగానే జువాంగ్ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని, జువాంగ్ బందీగా ఉన్న ఫోటోలు వారికి అందాయని వెల్లడయింది. తమ కుమారుడు బందీగా ఉన్నట్లు కనిపిస్తున్న ఫోటోలు చూసి భయపడ్డ జువాంగ్ తల్లిదండ్రులు అతన్ని విడిపించడానికి 80 వేల యూఎస్ డాలర్లు చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సైబర్ కిడ్నాపర్లు ఏం చేశారంటే..
చైనాలో తన కుటుంబం ప్రమాదంలో ఉందని కై జువాంగ్ కు చెప్పి, నీవే స్వయంగా కిడ్నాప్ గురయినట్లు దూర ప్రాంతానికి వెళ్లి అక్కడి నుండి ఫోటోలు పంపాలని సైబర్ కిడ్నాపర్లు బెదిరించారు. లేదంటే వారికి ప్రమాదం తలపెడతామని హెచ్చరించారు. ఈ వార్నింగ్ కు భయపడిన చైనా విద్యార్థి వారు చెప్పినట్లే నిర్మానుష్య ప్రదేశంలో తను బంధించబడినట్లు ఫోటోలు తీసి సైబర్ కిడ్నాపర్లకు పంపాడు. వీటిని వారు కై జువాంగ్ తల్లిదండ్రులకు పంపి.. తామే కిడ్నాప్ చేసినట్లు నమ్మించి, వారిని బెదిరించి 80 వేల యూస్ డాలర్లు చెల్లించకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు భయపడి వారు డిమాండ్ చేసిన డబ్బును చెల్లించారు. దీనిపై చైనా రాయబార కార్యాలయం అధికారులు, ఎఫ్‌బీఐ అధికారులు చేసిన సంయుక్త దర్యాప్తులో ఈ సైబర్ కిడ్నాపింగ్ వెలుగు చూసింది.
సైబర్ కిడ్నాపర్ల విషయంలో అవగాహన
మన పిల్లలు సైబర్ కిడ్నాపర్ల బాధితులు కాకుడదనుకుంటే మొబైల్ లేదా ల్యాప్ టాప్ వాడేటప్పుడు ఎలాంటి గేమ్స్ వాడుతున్నారన్నది గమనించాలి. సైబర్ నేరస్థుల పడకుండా వారికి జాగ్రత్తలు చెప్పాలి. ఇష్టమైన గేమ్స్ డౌన్ లోడ్ చేయడం , పబ్జీలాంటి గేమ్స్ ఆడటం వంటి వాటని మాన్పించాలి. వీటి మాటున సైబర్ నేరగాళ్లు ఉచ్చు పన్ని నేరాలకు పాల్పడుతుంటారు. సైబర్ కిడ్నాపర్ల విషయానికి వస్తే... పిల్లలకు మీ తల్లిదండ్రులు ప్రమాదంలో ఉన్నారని ఇలా చేయమని బెదిరిస్తుంటే, వారిని తమ తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన రోజు డేట్ లేదా ఏదైనా కోడ్ వర్డ్ చెబితే గాని నమ్మవద్దని పిల్లలకు తర్భీదు ఇవ్వాలి. అనుమానాస్పదంగా ఏదైనా చేయమని చెబితే వెంటనే దాన్ని క్లాస్ టీచర్లు లేదా తల్లిదండ్రులకు చెప్పాలని, ఎట్టి పరిస్థితుల్లో భయపడి వారు చేయమన్నది చేయవద్దని చెప్పాలి. పిల్లలను భయపెట్టి సైబర్ కిడ్నాపర్లు తమ డిమాండ్లు నెరవేర్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈవిధమైన అవేర్ నెస్ తల్లిదండ్రుల్లోను, పిల్లల్లోను ఉండాలి. అపరిచితుల నుండి మేసెజ్ లేదా కాల్స్ వస్తే తప్పనిసరిగా వారి నుండి పూర్తి వివరాలు, తల్లిదండ్రుల వివరాలలాంటివి అడిగి నిర్థారించుకోవాలి. అవేవి నిర్థారించుకోకుండా వెంటనే నమ్మకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నేరస్థుడు ఎంత తెలివిగల వాడయినా మనం మోసపోకుండా ఉండవచ్చు.