అన్వేషించండి

Canada Visa New Rules:వీసాల‌కు పెళ్లిల‌కు సంబంధం.. కెన‌డా సంచ‌ల‌న నిర్ణ‌యంతో భార‌త్‌కు ఇబ్బందులు తప్పవా!

కెన‌డా వీసాల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒక‌ర‌కంగా చ‌ర్చ‌మాత్ర‌మే కాదు.. ఇది సీరియ‌స్‌గా.. ఆస‌క్తిగా మారింది. పైగా భార‌త్‌లోని పంజాబ్‌, ఢిల్లీ, యూపీవంటి రాష్ట్రాల‌పై ప్ర‌భావం చూపించ‌నుంది.

Canada Visa New Rules: కెన‌డా(Canada) వీసా(Visa)ల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒక‌ర‌కంగా చ‌ర్చ‌మాత్ర‌మే కాదు.. ఇది సీరియ‌స్‌గా.. ఆస‌క్తిగా కూడా మారింది. పైగా భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల‌పై ప్ర‌భావం చూపించ‌నుంది. కెన‌డాలో చ‌దువుతున్న వారు మ‌ధ్య‌లో వివాహం చేసుకుంటే.. వారి జీవిత భాగ‌స్వాముల‌కు స్పౌజ్ వీసా(Spouse Visa) ఇచ్చే అవ‌కాశం ఇప్ప‌టి వ‌ర‌కు ఉంది. అయితే.. దీనివ‌ల్ల దేశంలో జ‌నాభా పెరిగిపోతున్నారు. ఇది ఆర్థికంగాను, రాజ‌కీయం(Politics)గాను ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. దీంతో స్పౌజ్ వీసాల విష‌యంలో క‌ఠిన నిబంధ‌న విధిస్తూ.. ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో(P.M. Justin Trudeau)ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇది.. భార‌తీయుల‌పై ప్ర‌భావం చూపించ‌నుందని ట్రావెల్ ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు. 

విష‌యం ఇదీ..
 
కెనడాలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు(Undergraduate courses) చదువుతున్న విద్యార్థులు తమ జీవిత భాగస్వాములకు స్పౌజ్ వీసా(Spouse Visa) స్పాన్సర్ చేసే అవకాశం ఇప్ప‌టి వ‌ర‌కు ఉంది. దీంతో ఎక్కువ మంది భార‌తీయ విద్యార్థులు, అమెరికా వీసా ల‌భించ‌ని వారు.. పొరుగున ఉన్న కెన‌డాకు చేరుకునేందు కు ఇది సౌల‌భ్యంగా ఉండేది. అయితే..  కెనడాలో ట్రూడో ప్రభుత్వం తాజాగా ఈ సౌలభ్యాన్ని తొలగించింది. దీంతో, ఇలాంటి వీసాల‌పై కెన‌డాకు ఎక్కువ‌గా వెళ్లే.. ఢిల్లీ, పంజాబ్‌, యూపీ త‌దిత‌ర రాష్ట్రాల వారు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పెళ్లిళ్ల‌పైనా ప్ర‌భావం..

ఐఈఎల్‌టీఎస్ పరీక్ష పాస్ అయిన వారు కెన‌డాకు చేరుకుంటే.. త‌మ భాగ‌స్వాముల‌కు చాలా తేలిక‌గా కెనడా వీసా ల‌భించేది. గత కొంతకాలంగా పంజాబ్‌లో కనిపిస్తున్న ట్రెండ్ ఇది. పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనం ప్రకారం, 1999-2022లో 9.51 శాతం మంది స్పౌజ్‌ వీసాతో కెనడాకు వెళ్లారు.  ఇలా వెళ్లిన వారిలో యువ‌కులే(male) ఎక్కుగా ఉన్న‌ట్టు తెలిపారు.  తమ పిల్ల‌ల‌ను ఈ మార్గంలో కెనడా పంపించేందుకు కుటుంబాలు రూ. లక్షలకు పైబడి ఆర్థికభారానికి కూడా సిద్ధపడుతున్నార‌ని.. స‌ద‌రు అధ్య‌య‌నం తెలిపింది. తాజాగా ట్రూడో స‌ర్కారు తీసుకువ‌చ్చిన‌ వీసా నిబంధనల ప్రకారం.. కెనడాలోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేస్తున్న వారు.. తమ జీవిత భాగస్వాములకు వీసా స్పాన్సర్ చేసే అవకాశం లేదు. దీంతో ఇది పెళ్లిళ్ల‌పైనా ప్ర‌భావం చూపుతోంద‌ని అంటున్నారు. 

ఎవ‌రికి వ‌ర్తిస్తాయి..

తాజాగా ట్రూడో స‌ర్కారు తీసుకువ‌చ్చిన వీసా నిబంధ‌న‌లు.. కేవ‌లం అండ‌ర్ గ్రాడ్యుయేట్(Under graduate) కోర్సులు చేస్తున్న‌వారికి మాత్ర‌మే వ‌ర్తించ‌నున్నాయి. మాస్టర్స్, డాక్టోరల్, లా, మెడిసిన్ కోర్సులు చదువుతున్న వారికి వ‌ర్తించ‌వు. అయితే.. ఈ కోర్సులు చేసే వారు ప‌దుల సంఖ్య‌లో(భార‌త్ నుంచి) ఉంటే.. అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేవారు వంద‌ల సంఖ్య‌లో ఉన్నారు. ఇక‌, ఇప్పటికే కెనడాలో ఉంటూ.. చదువుకుంటున్న వారికి తాజా నిబంధనలు వర్తించవు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి మాత్ర‌మే ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి.  

ఎందుకిలా?

కెన‌డా పీఎం జ‌స్టిన్ ట్రూడో అంటేనే.. ఫైర్ బ్రాండ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఏ విష‌యాన్నీ ఆయ‌న లైట్ తీసుకోరు. ఇలానే కెనడాలో విదేశీ విద్యార్థుల(International studenst) సంఖ్య పెరగడంతో అక్కడ ఇళ్ల కొరతకు దారి తీసింది. పైగా స్థానికుల‌కు ఇళ్లు ల‌భించ‌డం లేద‌ని రోజూ వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఇంటి అద్దెల(House Rent) ధ‌ర‌లు కూడా 100 శాతం పెరిగిపోయాయి. దీనికి కార‌ణం.. ఇత‌ర దేశాల నుంచి వ‌స్తున్న వారేన‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. మ‌రోవైపు స్థానికుల‌కు కూడా అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి. ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారం కాస్తా.. రాజ‌కీయ అంశంగా మారిపోయింది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశానికి విప‌క్ష నాయ‌కులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తున్నారు. దీంతో ట్రూడో స‌ర్కారు ఆలోచ‌న‌లో ప‌డింది. స్థానికంగా దేశ ప్ర‌జ‌ల నమ్మకం చూరగొన‌క పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని గ్ర‌హించిన‌ ప్రధాని..వలసలపై ఆంక్షలకు తెరలేపారు. ఈ క్ర‌మంలోనే తాజాగా కొత్త వీసా నిబంధ‌న‌లు తెచ్చారు. ఇవి ఈ ఏడాది సెప్టెంబ‌రు 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Embed widget