Russia Ukraine War: చేతుల్లో ల్యాండ్‌మైన్, నోట్లో సిగరెట్- 'కేజీఎఫ్' సీన్ గుర్తొచ్చింది గురూ!
Russia Ukraine War: ఉక్రెయిన్‌కు చెందిన ఓ పౌరుడు.. ఒట్టి చేతుల్తో ల్యాండ్‌మైన్‌ను తీసి అవతల పారేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
![Russia Ukraine War: చేతుల్లో ల్యాండ్‌మైన్, నోట్లో సిగరెట్- 'కేజీఎఫ్' సీన్ గుర్తొచ్చింది గురూ! WATCH: Russia Ukraine War Ukrainian Civilian Removes Mine With Bare Hands To Clear Way For Ukrainian Army Russia Ukraine War: చేతుల్లో ల్యాండ్‌మైన్, నోట్లో సిగరెట్- 'కేజీఎఫ్' సీన్ గుర్తొచ్చింది గురూ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/12d626ab445320b42b935922cd38f541_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Ukraine War: కేజీఎఫ్ సినిమాలో రాఖీ భాయ్.. ఓ క్లబ్‌లో పెట్రోల్ ట్యాంక్‌ను లీక్ చేసి సిగరెట్ వెలిగించుకుంటూ స్టైల్‌గా రౌడీలకు థమ్‌కీ ఇచ్చే సీన్ గుర్తుందా? అదెలా మర్చిపోతాం అంటారా? అది రీల్ సీనే కానీ.. అలాంటి సీన్ ఉక్రెయిన్‌లో రిపీట్ అయింది. కానీ ఇది నిజం. ఓ ఉక్రెయిన్ పౌరుడు ఏకంగా ఒట్టి చేతుల్తో ల్యాండ్‌మైన్ పట్టుకుని, నోట్లో సిగరెట్ పెట్టుకుని నడుస్తోన్న ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూడండి.
A Ukrainian in Berdyansk spotted a mine on the road and didn't wait around for a bomb disposal unit - at great risk to life and limb, he removed the mine, clearing the way for the Ukrainian military. pic.twitter.com/iC9ZTrixlC
— The New Voice of Ukraine (@NewVoiceUkraine) February 27, 2022
ఇదేందయ్యా
ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తోన్న రష్యా సేనలు.. ఓ రోడ్డుపై ల్యాండ్‌మైన్ పెట్టారు. అయితే ఓ ఉక్రెయిన్ కుర్రాడు దాన్ని ఏదో ఓ చెత్తను తీసి పారేసినట్లుగా తీసి అవతలపారేశాడు. పోర్ట్ సిటీ ఆఫ్ బెర్డయాన్‌స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను ఏర్పాటు చేశాయి.
ఇది గమనించిన ఉక్రెయిన్ పౌరుడు.. తనకు ఏం జరిగినా పర్లేదు కానీ తమ జవాన్లకు ఏమీ కాకూడదని పెద్ద సాహసమే చేశాడు. ఒట్టి చేతులతోనే ల్యాండ్‌మైన్‌ను పట్టుకుని దూరంగా విసిరి పారేశాడు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతడ్ని అందరూ ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
ఉక్రెయిన్ పోరాటం
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా ఏడో రోజు కూడా దాడులతో విరుచుకుపడుతోంది. అయితే ఇన్ని రోజులపాటు యుద్ధం చేయాల్సి వస్తుందని రష్యా కూడా ఊహించలేదని పలు నివేదికలు వస్తున్నాయి. ఉక్రెయిన్ ఈ రీతిలో ప్రతిఘటిస్తోందని రష్యా ఊహించలేదు. తమ దేశం కోసం ప్రాణాలైన ఇచ్చేస్తాం కానీ.. రష్యాకు తలొగ్గే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.
నాటో కూటమి, ఐరోపా సమాఖ్య.. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉన్నామని మద్దతు తెలిపింది. ఉక్రెయిన్‌కు యుద్ధ సామగ్రి, ఆయుధాలు, ఆర్థిక సాయాన్ని చేస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా వివిధ ఐరోపా దేశాధినేతలు.. పుతిన్ వెంటనే యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రష్యాను కోలుకోలేని రీతిలో ఆర్థికంగా దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారు.
Also Read: Russia Ukraine War: చల్లబడిన రష్యా సైనికులు- తిండి లేక, బండిలో ఇంధనం లేక, అంతా తికమక!
Also Read: Baba Vanga Prediction: పుతిన్ గురించి షాకింగ్ విషయాలు! రష్యాను ఎవరూ ఆపలేరా?: బాబా వాంగ కాలజ్ఞానం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)