By: ABP Desam | Updated at : 02 Mar 2022 03:22 PM (IST)
Edited By: Murali Krishna
పుతిన్ గురించి షాకింగ్ విషయాలు! రష్యాను ఎవరూ ఆపలేరా?: బాబా వాంగ కాలజ్ఞానం
Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ప్రపంచాన్ని ఎదిరించి రష్యా నిలబడగలదా? యుద్ధం పూర్తయ్యే సరికి రష్యా ఆర్థిక స్థితి తలకిందులవుతుందా? రష్యాను అమేయ శక్తిగా పుతిన్ మారుస్తారా? ఇప్పుడు చాలామందిలో ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వీటన్నింటికీ ఓ కాలజ్ఞాని ఎప్పుడో సమాధానం చెప్పేశారట. అవును బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ కాలజ్ఞాన్ని బాబా వాంగ.. పుతిన్ గురించి ఎప్పుడో చెప్పారట. ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టచ్ చేయలేరు
సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి సహా ఎన్నో విషయాలను ముందే ఊహించి చెప్పారు బాబాం వాంగ. ఆమె చెప్పిన వాటిలో 85 శాతం వరకు నిజమయ్యాయని చాలా మంది నమ్ముతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి కూడా ఆమె చెప్పారట.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఏదో ఒకరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని వాలెంటిన్ సిదోరోవ్ అనే ఓ రచయితకు వాంగ చెప్పారట. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఎలా చెప్పారు?
1911లో బల్గేరియాలో బాబా వాంగ పుట్టారు. 12 ఏళ్ల వయసులో ఓ తుపానులో కళ్లలో ఇసుక పడి ఆమె తన కంటిచూపును కోల్పోయారు. అప్పటి నుంచి భవిష్యత్తును ఊహించే శక్తి ఆమెకు వచ్చినట్లు చాలా మంది నమ్ముతారు.
1996లో ఆమె చనిపోయారు. కానీ 5079 సంవత్సరం వరకు ఆమె కాలజ్ఞానం చెప్పారు. ఆ ఏడాది వరకే ఎందుకు చెప్పారంటే అక్కడితో ప్రపంచం అంతమైపోతుందని బాబా వాంగ అన్నారట. అయితే ఆమె చెప్పిన వాటిలో చాలా ఇప్పటికే నిజమయ్యాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, డయానా యువరాణి మృతి, 2004 థాయిలాండ్ సునామీ, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక.. ఇలా వాంగ చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి.
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!
Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !