అన్వేషించండి

Joe Biden in India: భారత్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భద్రతలో 45 నిమిషాల కండీషన్ మీకు తెలుసా!

భారత్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.... మూడంచెల భద్రత ఏర్పాటు..

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జీ 20 సదస్సు నేటి ఉదయం మొదలైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో రెండు రోజుల పాటు జీ 20 సమావేశం కొనసాగుతోంది. ప్రపంచ దేశాధినేతలకు ఆతిథ్యం  ఇచ్చేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాటు చేశాయి. దీంతో దేశ రాజధాని అంతట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడికి సాదరంగా స్వాగతం పలకగా.... ప్రస్తుతం ఆయన భద్రతకు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

బైడెన్ సెక్యూరిటీ ఫుల్ టైట్......
ప్రపంచానికి పెద్దన్న అమెరికా.. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అమెరికాపై ఆధారపడి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంతటి కీర్తి ఉన్న ఈ దేశ అధ్యక్షుడి భద్రత విషయంలో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా అధ్యక్షుడు కేవలం అమెరికాలో మాత్రమే కాదు ఇతర దేశాల్లో ఉన్నా ఆయన భద్రత చాలా కఠినంగా ఉంటుంది.  సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం నుంచి కఠినమైన  ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రధాన రహదారులు నిర్మాణస్యంగా మారాయి.

అమెరికా అధ్యక్షుడి భద్రతకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జోబిడైన్‌ భద్రత కోసం అనేక రకాల ప్రోటోకాల్స్‌ను అధికారులు తూచా తప్పకుండా పాటించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా అతడు బస చేసే హోటల్‌ నుంచి అత్యాధునిక వసతులతో కూడిన ఆసుపత్రి కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకునేలా ఉండాలి. సమీపంలోని అన్ని ఆసుపత్రుల జాబితా భద్రతా సిబ్బంది దగ్గర ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధ్యక్షుడిని నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఈ చర్యలు తీసుకుంటారు. అలాగే ఆసుపత్రుల్లోని ట్రామా సెంటర్లు ఎప్పుడు అలర్ట్‌గా ఉంటాయి.

ఇదిలా ఉంటే ఢిల్లీ చేరుకున్న జో బిడెన్ ఢిల్లీలోని ధౌలా కువాన్ సమీపంలో ఉన్న హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేస్తారు. ఈ హాస్పిటల్‌కు చేరువలో చాలా పెద్ద చాలా పెద్ద ఆసుపత్రులు తక్కువ దూరంలో ఉన్నాయి. ఈ ఆసుపత్రుల వెలుపల ఒక ఏజెంట్‌ను కూడా ఉంచుతారు, అవసరమైతే వైద్యులతో ముందుగానే మాట్లాడి భద్రతా ఏర్పాట్లను చూసుకుంటారు. అత్యవసర పరిస్థితి కోసం అధ్యక్షుడి కారులో ఎల్లప్పుడూ ఒక రక్తం ప్యాకెట్ ఉంటుంది. ఆసుపత్రికి చేరేలోపు రక్తం అవసరమైతే అందించేందుకు అధ్యక్షుడి బ్లెడ్‌ గ్రూప్‌ రక్తాన్ని సిద్ధంగా ఉంచుతారు. ఇక అమెరికా అధ్యక్షుడి భద్రత ప్రోటోకాల్‌లో మరో కీలక అంశం బహిరంగ ప్రదేశంలో అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో 45 నిమిషాలు మించి ఉండకూడదు.  

బైడెన్‌కు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి వీకే సింగ్...
జీ 20 సదస్సుకు ఢిల్లీకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఆయనను సాదరంగా ఆహ్వానించడానికి కేంద్ర మంత్రి వి కే సింగ్ సాదరంగా ఆయనను ఆహ్వానించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Chiranjeevi: ఢిల్లీకి చిరంజీవి అండ్ ఫ్యామిలీ... రేపే పద్మ విభూషణుడికి గౌరవ సత్కారం
ఢిల్లీకి చిరంజీవి అండ్ ఫ్యామిలీ... రేపే పద్మ విభూషణుడికి గౌరవ సత్కారం
KTR On Revanth : అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Sharmila Comments : ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Secunderabad BRS MP Candidate T.Padhama Rao Goud | కిషన్ రెడ్డి ఇంటికి..నేను పార్లమెంటుకు | ABPDirector Sukumar on Arya 20 Years | ప్రభాస్ ని తీసుకోమంటే నేను అల్లు అర్జున్ కావాలన్నాను | ABP DesamCantonment BRS MLA Candidate Niveditha |  కేసీఆర్ మళ్లీ  రావాలంటే ఏం చేయాలని జనం  అడుగుతున్నారు..?|SS Rajamouli on Animation Films | యానిమేషన్ సినిమాలపై తన అభిప్రాయం చెప్పిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Chiranjeevi: ఢిల్లీకి చిరంజీవి అండ్ ఫ్యామిలీ... రేపే పద్మ విభూషణుడికి గౌరవ సత్కారం
ఢిల్లీకి చిరంజీవి అండ్ ఫ్యామిలీ... రేపే పద్మ విభూషణుడికి గౌరవ సత్కారం
KTR On Revanth : అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Sharmila Comments : ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
Anchor Divorce: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
Sharmila Vs Avinash Reddy: అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
Sam Pitroda: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
Sam Pitroda: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
Telangana News: బీ
బీ"ఆర్‌"ఎస్‌ది ఫెవికాల్ బంధం- ట్రిపుల్ ఆర్‌ వసూళ్లను మించేలా డబుల్ ఆర్ వసూళ్లు - వేములవాడ ప్రచార సభలో మోదీ విమర్శలు
Embed widget