By: ABP Desam | Updated at : 28 Feb 2022 02:19 PM (IST)
Edited By: Murali Krishna
ఉక్రెయిన్ అధ్యక్షుడే రష్యా టార్గెట్
Ukraine-Russia War: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఐదో రోజు కూడా యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని చుట్టుముట్టి రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. కీవ్‌ను అధీనంలోకి తీసుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ రష్యా సేనలను ఉక్రెయిన్ ఆర్మీ దీటుగా ప్రతిఘటిస్తోంది. అయితే తాజాగా బ్రిటన్ పత్రిక 'ద టైమ్స్' ఓ సంచలన నివేదికను బయటపెట్టింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీని చంపేందుకు రష్యా పక్కా ప్రణాళికను సిద్ధం చేసిందని పేర్కొంది.
400 మంది
జెలెన్‌స్కీని చంపేందుకు 400 మంది రష్యా ఉగ్రవాదులను కీవ్‌లో మోహరించినట్లు ఈ నివేదిక చెబుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను దక్కించుకోవాలంటే జెలెన్‌స్కీని మట్టుబెట్టాలని రష్యా యోచిస్తున్నట్లు సమాచారం.
కీవ్‌లో వైమానిక దాడులకు రష్యా ప్రయత్నించే అవకాశముందని సమాచారం. దీంతో అక్కడి ప్రజలు సమీపంలోని షెల్టర్‌లో ఆశ్రయం పొందాలని ప్రభుత్వం సూచించింది. అలాగే చెర్నిహివ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. దాంతో రెండు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి.
198 మంది మృతి
ఉక్రెయిన్‌పై రోజురోజుకు రష్యా సేనలు దాడులను పెంచుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా సేనలు అధీనంలోకి తీసుకున్నాయి. అలానే మరిన్ని నగరాలపై క్షిపణి దాడులు చేస్తోంది. శనివారం వరకు రష్యా దాడుల్లో 198 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. 1,684 మంది గాయపడ్డారు.
తగ్గేదేలే
రష్యా దాడులను ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. ఆయుధాలు, సైనికులు తక్కువున్నప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేతృత్వంలో ఆ దేశ ఆర్మీ పోరాడుతోంది. ప్రపంచ దేశాలు సాయం చేయాలని జెలెన్‌స్కీ కోరుతున్నారు. ఆదివారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడారు. తదుపరి 24 గంటలకు ఎంతో కీలకమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
బెలారస్ సైన్యం
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా బెలారస్ తన సైన్యాన్ని పంపే యోచనలో ఉన్నట్లు అమెరికాకు చెందిన ఓ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్‌తో రష్యా బలగాలతోపాటు బెలారస్ సైన్యం పోరాడవచ్చన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని బెలారస్ మద్దతిస్తోంది. కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉక్రెయిన్‌తో పోరాడలేదు.
Also Read: Ukraines Lifestyle: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Don Dawood In Karachi: కరాచీలో దావూడ్ ఇబ్రహీం- ఈడీ విచారణలో చెప్పిన ఛోటా షకీల్ బావ
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే
US President strong Warning to China: చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్- తైవాన్‌కు అండగా ఉంటామని బిడెన్ ప్రకటన
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్
Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత