Russia Ukraine War: మన ఆడపిల్లలపై ఉక్రెయిన్ సైనికుల వేధింపులు- కాలితో తన్ని నెట్టేస్తోన్న వీడియో వైరల్
Russia Ukraine War: ఉక్రెయిన్ నుంచి ఇతర సరిహద్దులకు తరలివెళ్తున్న భారత విద్యార్థినులపై ఆ దేశ సైనికులు, పోలీసులు చేయిచేసుకుంటున్నారు. వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Russia Ukraine War: ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరేందుకు భారత విద్యార్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ నగరాల నుంచి వివిధ దేశాల సరిహద్దులకు మన విద్యార్థులు తరలివెళ్తున్నారు. అయితే పలు సరిహద్దుల వద్ద ఉక్రెయిన్ అధికారులు.. మన విద్యార్థులపై దాడి చేయడం, తోసేయడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆడ పిల్లలపై
If this is true, it shows #Ukraine soldiers manhandling Indian students. India must take public stand & complain. https://t.co/8AOs5lV7Mo
— Rajiv Malhotra (@RajivMessage) February 27, 2022
ఉక్రెయిన్- పోలాండ్ సరిహద్దు వద్ద మన భారత యువతులపై ఆ దేశ అధికారులు చేయిచేసుకున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. ఓ వీడియోలో అయితే భారత యువకుడిని పదేపదే.. అధికారి కాలుతో తన్నుతున్నాడు.
మరో వీడియోలో అయితే ఉక్రెయిన్ సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి మన విద్యార్థులను తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లాలని బలవంతం చేస్తున్నారు. ఇద్దరు యువతులపై ఉక్రెయిన్ పోలీసులు లాఠీఛార్జీ కూడా చేశారు.
రాహుల్ ట్వీట్
My heart goes out to the Indian students suffering such violence and their family watching these videos. No parent should go through this.
— Rahul Gandhi (@RahulGandhi) February 28, 2022
GOI must urgently share the detailed evacuation plan with those stranded as well as their families.
We can’t abandon our own people. pic.twitter.com/MVzOPWIm8D
ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో భారత విద్యార్థినులను ఉక్రెయిన్ సైనికులు నెట్టేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తరలించే ప్లాన్‌ను వెంటనే ప్రభుత్వం షేర్ చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
వెళ్లనివ్వట్లేదు
A Ukrainian security officer kicking the already distressed Indian students. Wonder what crime have they committed to deserve such a treatment?pic.twitter.com/5PIpHMOECu
— Jas Oberoi | ਜੱਸ ਓਬਰੌਏ (@iJasOberoi) February 27, 2022
ఉక్రెయిన్ అధికారులు తమను పోలాండ్ సరిహద్దుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మరో భారత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. రష్యా- ఉక్రెయిన్ వివాదం విషయంలో భారత్.. రష్యాకు మద్దతు ఇస్తుందని వారు ఆరోపిస్తున్నట్లు చెప్పాడు.
తిండి లేకుండా
మరికొంత మంది విద్యార్థులు తమకు ఎలాంటి ఆతిథ్యం దక్కడం లేదని నీరు, ఆహారం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెర్నివత్సీ వద్ద 21 మంది భారత విద్యార్థులు నిలిచిపోయారు. భారత యువతులను ఉక్రెయిన్ పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు.
Also Read: Russia Ukraine Conflict: రష్యా కుబేరులకు భారీ షాక్ - పుతిన్ నిర్ణయాలకు ఎంత మేర నష్టపోయారో తెలుసా !
Also Read: Ukraines Lifestyle: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయొచ్చు