Andhra King Taluka Censor Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రివ్యూ: రామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్... సినిమాలో హైలైట్స్ ఏమిటంటే?
Andhra King Taluka First Review: యంగ్ & ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. సెన్సార్ నుంచి ఈ సినిమా రివ్యూ వచ్చింది. అది ఎలా ఉందో తెలుసా?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka Movie). కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుందీ సినిమా. నవంబర్ 27న విడుదల. అమెరికాలో ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. తాజాగా సెన్సార్ పూర్తి అయ్యింది. సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ సభ్యుల నుంచి సినిమాకు వచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా'లో హైలైట్స్ ఏమిటంటే?
సాధారణంగా హీరోలకు అభిమానులు ఉంటారు. అయితే ఓ అభిమానిని హీరోగా చూపెడుతూ తీసిన సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. తమ అభిమాన హీరోకి కటౌట్స్ కడుతూ, కొత్త సినిమా విడుదల సమయంలో థియేటర్స్ దగ్గర హంగామా చేసే ఓ అభిమాని జీవితంలో ఏం జరిగింది? అది తెలిసి హీరో ఏం చేశాడు? అనేది కథగా తెలుస్తోంది.
'ఆంధ్ర కింగ్ తాలూకా'లో హైలైట్స్ విషయానికి వస్తే... రామ్ పోతినేని తన పాత్రలో జీవించారని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సేతో రామ్ కెమిస్ట్రీ సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందట. హీరో హీరోయిన్స్ మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయని, కేవలం ఉపేంద్ర - రామ్ ఎపిసోడ్ మాత్రమే హైలైట్ కాదని... సినిమాలో ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయని టాక్.
Also Read: ప్రభాస్‌తో ఐదారు సీన్లు ఇస్తారనుకున్నా, కానీ... 'ది రాజా సాబ్'లో రోల్‌పై మాళవిక ఏమన్నారంటే?
సినిమాకు కోర్ స్ట్రెంత్ పాయింట్స్‌లో హీరో రామ్ పోతినేని - ఆయన ఫాదర్ మధ్య ట్రాక్ కూడా ఒకటని తెలిసింది. ఉపేంద్ర సన్నివేశాలు చాలా బాగా వచ్చాయట. ఇక మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటున్నారు. సినిమా విడుదలకు ముందు పాటలకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో చివరి 45 నిమిషాలు మాత్రం ప్రేక్షకులు కళ్ళు అప్పగించి అలా చూసేలా దర్శకుడు మహేష్ బాబు పి తీశారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఖర్చుకు రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో 'ఆంధ్ర కింగ్ తాలూకా'ను నిర్మించిందని, సినిమా చూస్తున్న టైంలో ప్రొడక్షన్ వేల్యూస్ గురించి ప్రేక్షకులు తప్పకుండా మాట్లాడుకుంటారని సెన్సార్ నుంచి అందిన రివ్యూ.
Also Read: 'బాబ్' మహేష్ ఎంట్రీ కోసం అంత ప్లానింగా - రాజమౌళితో మామూలుగా ఉండదు!
సెన్సార్ నుంచి 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు బ్లాక్ బస్టర్ రివ్యూ రావడంతో నవంబర్ 27న థియేటర్లలోనూ సేమ్ టాక్ రిపీట్ అవుతుందని చెప్పవచ్చు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' తర్వాత మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ - మెర్విన్ సంగీత దర్శకులు. రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్, సత్య తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ఇందులో రామ్ ఓ పాట రాయడంతో పాటు మరో పాటను ఆలపించారు.





















