Tulsi Bhai: మోదీకి షాకిచ్చిన WHO చీఫ్- మురిసిపోయిన ప్రధాని, వీడియో వైరల్!
డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్.. ప్రధాని మోదీకి షాకిచ్చారు. ఓ కార్యక్రమంలో గుజరాతీలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పేరు పెట్టారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఆయుశ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి డబ్ల్యూహెచ్‌ఓ అధినేత టెడ్రోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టెడ్రోస్ గుజరాతీలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
Watch: @WHO Director-General Dr Tedros Adhanom Ghebreyesus greets the public in Gujarati during the inaugural ceremony of the WHO Global Centre for Traditional Medicine in Jamnagar. pic.twitter.com/MjeYURyMmO
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) April 19, 2022
మోదీ చిరునవ్వు
"అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు?" అంటూ టెడ్రోస్ గుజరాతీ భాషలో పలకరించారు. దీంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఇది చూసిన మోదీ సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు.
సంప్రదాయ వైద్యం
గుజరాత్ పర్యటనలో భాగంగా మోదీ రెండో రోజైన మంగళవారం ఆ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రియేసస్, మారిషస్ ప్రధాని ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ పాల్గొన్నారు.
ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ నూతన శకం ప్రారంభం కానుందని ప్రధాని మోదీ అన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని మోదీ అన్నారు. ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్యాలు కేవలం చికిత్సా విధానాలు కావని అవి భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలని మోదీ పేర్కొన్నారు.
Also Read: DDMA Covid-19 Guidelines: మళ్లీ అదే కథ- దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఇక మాస్కు పెట్టుకోకపోతే!