Coronavirus Cases India: భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌కు సంకేతమా !
Coronavirus Cases India: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న Covid Cases దేశంలో 4th Wave భయాలను పెంచుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11వేల 860 కు చేరుకుంది.
Corona Cases In India: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు నాలుగో వేవ్ (Corona 4th Wave In India)కు సంకేతమా అనే అనుమానాలు మొదలయ్యాయి. రాజధాని నగరం ఢిల్లీలో నమోదవుతున్న కేసుల సంఖ్య నాలుగో వేవ్ కు సంకేతమా అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. అక్కడ గడచిన నాలుగురోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఢిల్లీలో 501 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 7.72 కు చేరుకుంది. చివరిసారి జనవరి 28న ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.6 శాతం, జనవరి 29న 7.4 నమోదైంది. మళ్లీ మూడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది.
కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా.. పలు రాష్ట్రాల్లో ఆందోళన..
మూడో వేవ్ కేసులు తగ్గు ముఖం పట్టినా... కొత్త వేరియంట్ల ప్రభావం ప్రజలను వదలటం లేదు. స్టెల్త్ ఒమిక్రాన్, డెల్మాక్రాన్ అంటూ కోవిడ్ వేరియంట్లు విజృంభిస్తూనే ఉన్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 1247 పాజిటివ్ కేసులు నమోదైతే... పాజివిటీ రేటు దేశవ్యాప్తంగా 0.31 శాతంగా ఉంది. వాటిలో ఢిల్లీలోనే 632 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పాజిటివిటి రేటు 4.42 గా ఉంది. ఈ గణాంకాలు చూస్తుంటే నాలుగో వేవ్ సంకేతాలా అని ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం ఉదయానికి ఇండియాలో యాక్టివ్ కేసులు 11వేల 860కి చేరుకున్నాయి.
కేంద్రం కూడా పాజిటివ్ కేసులు నమోదువతున్న రాష్ట్రాలకు లేఖలు రాసింది. యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్రాలకు మంగళవారం లేఖ రాశారు. ఈ రాష్ట్రాలన్నీ ఐదంచెల విధానాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్, కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఇలా ఐదు అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మాస్క్ ల వినియోగం, భౌతిక దూరం లాంటి కోవిడ్ ప్రోటోకాల్స్ ను పక్కాగా అమలు చేస్తే తప్ప కేసులను కంట్రోల్ చేయలేమని వివరించింది.
గడిచిన 24 గంటల్లో 1,547 మంది కరోనా వైరస్‌ను జయించడంతో భారత్‌లో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 4,25,13,248 (4 కోట్ల 25 లక్షల 13 వేల 248)కు చేరుకుందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 192 కోట్ల 27 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ మోతాదులను కేంద్రం సరఫరా చేసింది. వీటిలో ఇంకా 20 కోట్ల 33 లక్షల డోసులు ప్రజలకు ఇవ్వడానికి నిల్వ ఉన్నాయి. అయితే కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్లకే తిరిగి అటాక్ అవుతుంది కనుక...దీన్ని ఇమ్యునైజేషన్ సమస్యగానే చూడాలి తప్ప..నాలుగో వేవ్ ఇప్పటికప్పుడు ప్రకటించలేమని కేంద్రప్రభుత్వం చెబుతోంది.
Also Read: Vegetarian Food: శాకాహారంతో మగవారు ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు
Also read: మైదా అవసరం లేకుండా ఇంట్లోనే అరటి పండుతో కప్‌కేక్స్, చేయడం చాలా సులువు