By: ABP Desam | Updated at : 19 Apr 2022 03:58 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
వేసవిసెలవులు వచ్చేస్తున్నాయి. ఇంట్లో పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు అంటూ తల్లిదండ్రులకు తినేందుకు అడుగుతూనే ఉంటారు. ప్రతిది కొని పెట్టడం మంచిది కాదు. ఖరీదులు కూడా అధికంగానే ఉంటున్నాయి. అదే ఇంట్లోనో మఫిన్స్ లేదా కప్ కేకులు తయారు చేస్తే శుచికి శుచి, పైగా తక్కువ ఖర్చులోనే బోలెడన్నీ కేకులు తయారుచేసుకోవచ్చు. బయట చేసిన కేకుల్లో ఎక్కువ మంది మైదాపిండి వాడే అవకాశం ఉంది. ఆరోగ్యానికి మైదా మంచిది కాదు. ఇంట్లోనే మైదా అవసరం లేకుండా గోధుమ పిండితో కేకులు చేయచ్చు. అరటిపండును కూడా కలిపి చేస్తే ఆరోగ్యం కూడా. చాలా సింపుల్ గా చేయచ్చు.
కావాల్సిన పదార్థాలు
అరటి పండ్లు - మూడు
గోధుమ పిండి - కప్పున్నర
పంచదార - పావు కప్పు
బేకింగ్ పౌడర్ - ఒక స్పూను
బేకింగ్ సోడా - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
వెనీలా ఎక్స్ ట్రాక్ట్ - ఒక స్పూను
ఉప్పు - చిటికెడు
తయారీ ఇలా...
1. బాగా పండిన అరటిపండ్లను గిన్నెలో వేసి బాగా గుజ్జుగా చేతులతో నలిపేయాలి.
2. అందులో చక్కెర కూడా వేసి కలపాలి.
3. ఆ గుజ్జులో నిమ్మరసం, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ కూడా వేసి బాగా గిలక్కొట్టాలి.
4. గోధుమపిండి,ఉప్పు వేసి ఉండల్లేకుండా ఆ మిశ్రమంలో వేయాలి.
5. కేకులు మెత్తగా వచ్చేందుకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా బాగా కలపాలి.
6. మిశ్రమం మరీ మందంగా అనిపిస్తే కాస్త పాలు కలుపుకోవచ్చు.
7. ఇప్పుడు కప్‌కేక్ ట్రేలో కాస్త వెన్న రాసి ఈ పిండిని వేయాలి.
8. మైక్రో ఓవెన్‌ను పదినిమిషాలు ఉంచితే కేకులు రెడీ అవుతాయి.
ఈ రెసిపీలో మనం వాడిన పదార్థాలేవీ ఆరోగ్యానికి హానికరమైనవి కాదు. అరటి పండు, గోధుమ పిండి ఇవే ఇందులో వాడిన ప్రధాన పదార్థాలు. ఈ రెండూ పిల్లలకు మంచివే. మైదా పిండితో పోలిస్తే గోధుమ పిండి చాలా ఉత్తమం. అరటిపండులో ఉండే ఉత్తమ గుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకం. ఈ కప్ కేకులు పిల్లలకు రోజుకు రెండు తినిపిస్తే మంచిదే.
Also read: జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ‘స్పితి వ్యాలీ’, మనదేశంలోనే ఉంది
Also read: బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారా? ముందుగా ఈ విషయాల్లో ఓ క్లారిటీకి రండి
Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!
Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Bad Body Odour: శరీర దుర్వాసన చికాకు పెడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే!
Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?
Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !