అన్వేషించండి

Iran War: సీజ్ ఫైర్ గడువు ముగియగానే యుద్ధమే - డీల్‌కు రావాల్సిందే - ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

war ready : ఇరాన్ , అమెరికా మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. చర్చలకు ససేమిరా అన్న టెహ్రాన్ కు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జార చేశారు.

Trump ready to go back to war as ceasefire end: ఇరాన్ ,  అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య యుద్ధం 53వ రోజుకు చేరుకుంది. ఒకవైపు కాల్పుల విరమణ గడువు సమీపిస్తున్నప్పటికీ, శాంతి దిశగా అడుగులు పడకపోగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, దిగ్బంధనం కారణంగా చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. బెదిరింపుల నీడలో చర్చలు జరపలేము  అని టెహ్రాన్ తేల్చి చెప్పడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంలో తన దూకుడును కొనసాగిస్తున్నారు. ఇరాన్ రేవులపై విధిస్తున్న నావికా దళ దిగ్బంధనం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించేది లేదని ఆయన స్పష్టం చేశారు.  ఇరాన్ తన మొండి వైఖరి వీడి,  అణు ఒప్పందం విషయంలో మా డిమాండ్లకు లొంగి వచ్చే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుంది  అని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా యుద్ధ నౌకలు ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిఘా పెంచాయి.
 
ఇరాన్ ,  అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు క్లిష్టతరంగా మారాయి. రెండు దేశాల మధ్య ఉన్న భారీ అగాధాన్ని పూడ్చడం ప్రస్తుతానికి సాధ్యం కావడం లేదు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు అమెరికాను అమెరికా తీవ్రవాద ధోరణితో వ్యవహరిస్తోందని, నిత్యావసరాలను కూడా అడ్డుకోవడం మానవత్వానికి విరుద్ధమని మండిపడుతున్నారు.
 
ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతోంది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే బారెల్‌కు 94 డాలర్లకు పైగా చేరుకున్నాయి. ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా వంటి దేశాలు కూడా ఈ యుద్ధం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.   


అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ , రష్యా వంటి దేశాలు పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించాయి. ఇరాన్‌లో ఇంటర్నెట్ ఆంక్షలు, ఆహార కొరత వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారతాయేమోనన్న భయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget