Japan Dental Regrowth: దంతాలు ఊడిన ప్రతిసారి పెరుగుతాయి! సరికొత్త విప్లవం తీసుకొచ్చిన జపాన్ శాస్త్రవేత్తలు
Japan Dental Regrowth: మరో ఐదేళ్లలో వైద్యశాస్త్రంలో మరో విప్లవం రాబోతోంది. ఊడిన దంతాల స్థానంలో మళ్లీ మళ్లీ దంతాలు పెరిగే సీక్రెట్‌ను జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Japan Dental Regrowth: జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ హాస్పిటల్‌లో చరిత్రలో తొలిసారిగా దంతాలను పునరుత్పత్తి చేసే ఔషధంపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాలు విజయవంతమైతే 2030 నాటికి దంతాల పునఃసృష్టి ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
USAG-1 ప్రోటీన్: దంతాల వృద్ధికి అవరోధం
మనుషులకు సాధారణంగా రెండు సెట్లు దంతాలను మాత్రమే పెరుగుతారు - పాల దంతాలు, శాశ్వత దంతాలు. కానీ మూడో సెట్ దంతాలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. USAG-1 అంటే యూటెరైన్ సెన్సిటైజేషన్-అసోసియేటెడ్ జీన్-1 అనే ప్రోటీన్ కారణంగా అవి పెరగకుండా ఉండిపోతాయని నిర్దారించారు. USAG-1 ప్రోటీన్ BMP (బోన్ మార్ఫోజెనెటిక్ ప్రోటీన్) Wnt సిగ్నలింగ్ అనే రెండు వాటి పెరుగుదలను నియంత్రిస్తాయి. అవి పెరగకుండా ఉండేందుకు దారులు మూసివేస్తాయి.
TRG-035- విప్లవాత్మక ఔషధం
TRG-035 అనే కొత్త ఔషధంతో ఇప్పుడు దంతాల పెరుగుదల నియంత్రించే దారులను తెరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. USAG-1 ప్రోటీన్‌ను నిరోధించగలుగుతుంది. దీనిని ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. ఎలుకలు ఇతర జంతువులపై చేసిన ప్రయోగాల్లో విజయవంతమైంది. కొత్త దంతాలు పెరిగేందుకు సహకరించింది.
క్లినికల్ ట్రయల్స్ వివరాలు
జంతువులపై విజయవంతమైన ప్రయోగాలను ఇప్పుడు మనుషులపై చేస్తున్నారు. ఇప్పటికే కొందరిపై చేసి మంచి ఫలితాలు సాదిస్తున్నారు.
మొదటి దశ (2024 అక్టోబర్-2025 ఆగస్టు)
30 మంది ఆరోగ్యవంతమైన పురుషులు (30-64 ఏళ్లు) పాల్గొన్నారు. వీరికి కనీసం ఒక దంతం కూడా లేదు. ప్రాథమిక లక్ష్యం ఔషధం భద్రతను పరీక్షించడం.
రెండవ దశ
2-7 ఏళ్ల పిల్లలు జన్మతః నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దంతాలు లేని వారిపై పరీక్షలు జరుగుతాయి. ఇది ఒలిగోడాంటియా అనే వంశపారంపర్య వ్యాధిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ వ్యాధి ఉన్న వారికి ఎక్కువ దంతాలు ఉండవు. వారిపై ప్రయోగాలు చేస్తారు.
పరిశోధన నేత డాక్టర్ కత్సు తకహాషి
మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కితానో హాస్పిటల్ ఒసాకాలోని డాక్టర్ కత్సు తకహాషి దంతాలపై పరిశోధనకు నాయకత్వం వహిస్తున్నారు. "కొత్త దంతాలు రావడం ప్రతి డెంటిస్ట్ కల. నేను గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి దీనిపై పని చేస్తున్నాను" అని ఆయన తెలిపారు.
ప్రయోజనాలు
ఎవరికి ఉపయోగపడతాయి?
- జన్మతః దంతాలు లేని పిల్లలకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి.
- గాయాలు, దంత క్షయం వల్ల దంతాలు కోల్పోయిన వారు.
- డెంచర్లు, ఇంప్లాంట్లకు ప్రత్యామ్నాయం కోరుకునే వారు.
సాంప్రదాయిక చికిత్సలపై ప్రయోజనాలు
- సహజ దంతం: కృత్రిమ ఇంప్లాంట్లకు బదులుగా ఈ చికిత్స ఉపయోగపడతాయి.
- దీర్ఘకాలిక ఖర్చు తగ్గింపు: సహజ దంతాలు దశాబ్దాలు నిలుస్తాయి
- మెరుగైన జీవనశైలి: నమలడం, మాట్లాడడం, నవ్వడంలో విశ్వాసం పెరుగుతుంది.
2030 నాటికి ఈ దంతాల పెరుగుదలను వాడుకలోకి తీసుకురావాలని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రాథమికంగా జన్మతః దంతాలు లేని పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తారు. తర్వాత గాయాలు లేదా వ్యాధుల వల్ల దంతాలు కోల్పోయిన వారికి వర్తింపజేస్తారు.





















