G20 Summit 2022 : నవంబర్ 15 నుంచి రెండు రోజుల పాటు బాలిలో జీ20 సదస్సు
భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జీ20 సద్ససులో బిజీబిజీగా గడపనున్నారు. మొత్తం 45 గంటల్లో ప్రధాని మోదీ 20 సదస్సుల్లో పాల్గొంటారు.
ఇండోనేషియా లోని బాలిలో రెండు రోజుల పాటు G20 సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ సహా జీ20 అధినేతలు అంతా బాలిలో నవంబర్ 15,16 రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈసారి G20 సమావేశాలకు రష్యా గైర్హాజరు అవుతోంది. రష్యా పుతిన్ జీ20 సమ్మిట్ లో పాల్గొనటం లేదని ఆ దేశ అధికార ప్రతినిధి జీ20 సమ్మిట్ నిర్వాహకులకు సమాచారం అందించారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సమ్మిట్ లో పాల్గొంటే ప్రపంచ దేశాల అధినేతల నుంచి పుతిన్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చిరకాల మిత్రుడు భారత్ సహా అగ్రదేశాలు అమెరికా ఇంకా యూరోపియన్ యూనియన్ నుంచి రష్యాకు ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక జీ20 కు హాజరు కాకూడదని పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అగ్రదేశాల తాకిడికి పుతిన్ భయపడ్డారనే ప్రచారం ఇంటర్నేషనల్ మీడియాలో జరుగుతోంది.
ఈ సదస్సులో ఆసక్తి రేపుతున్న ఇంకో అంశం చైనా-అమెరికా అధ్యక్షుల భేటీ. ప్రపంచశక్తిగా ఎదుగుతున్న చైనాను నిలువరించాలని గతంలో చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించిన అమెరికా ఇప్పుడు స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. చైనాతో ఘర్షణ పడాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశంతో పోటీ పడాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని, ఉద్రిక్తతలు నివారించటానికి తమవైపు నుంచి సమాచార వ్యవస్థలన్నింటిని తెరిచే ఉంచుతామని కంబోడియాలో జరిగిన తూర్పు ఆసియా సదస్సులో మాట్లాడుతూ బైడెన్ మాట్లాడారు.
ఇక భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జీ20 సద్ససులో బిజీబిజీగా గడపనున్నారు. మొత్తం 45 గంటల్లో ప్రధాని మోదీ 20 సదస్సుల్లో పాల్గొంటారు. ఇంటర్నేషనల్ ఎకనమిక్ కో ఆపరేషన్ మీద సౌత్ ఏషియన్ కంట్రీస్ వాయిస్ ను మోదీ వినిపించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఇంకో విషయం ఈ ఇయర్ జీ 20 సమావేశాలు మన దేశానికి చాలా కీలకం ఎందుకంటే ఈ సమావేశాల తర్వాత రోస్టర్ ఛైర్ ప్రకారం ఏడాది పాటు భారత ప్రధాని జీ20 కి అధ్యక్షుడిగా ఉంటారు. అంతే కాదు 2023 లో జీ20 సమావేశాలు భారత్ లోనే జరగనున్నాయి. జీ20 కు అధ్యక్షుడిగా ఉండటమే చాలా పెద్ద విషయమే అని చెప్పుకోవాలి. జీ20 లో ఉండే 20 దేశాలు చాలా శక్తివంతమైనవి. గ్లోబల్ జీడీపీ లో 85 శాతం ఈ దేశాల నుంచే వస్తోంది. ప్రపంచ వర్తక వాణిజ్యాల్లో 75 శాతం వాటా జీ20 దేశాలదే. ప్రపంచజనాభాలో మూడింట రెండొంతల జనాభా కూడా ఈ దేశాల్లోనే ఉంది. సో ఈ సమావేశాలు ఆ తర్వాత ఏడాది గ్లోబల్ ఎకనమిక్ పవర్ గా ఎదగటానికి ఇండియాకు చాలా కీలకం. సో మోదీ ఆలోచనలు, ఇండియన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందుకు అనుగుణంగానే ఉండనుంది.