(Source: ECI/ABP News/ABP Majha)
Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు పరుగో పరుగు- సింగపూర్ నుంచి సౌదీ చెక్కేసిన రాజపక్స!
Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాజాగా సౌదీ అరేబియాకు పయనమైనట్లు అధికారులు తెలిపారు.
Sri Lanka Crisis: శ్రీలంక ప్రజల దెబ్బకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఓ దేశం నుంచి మరో దేశానికి పరుగులు పెడుతున్నారు. తాజాగా ఆయన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో సింగపూర్ వెళ్లి అనంతరం సౌదీ అరేబియా వెళ్తునట్లు మాల్దీవులు అధికారులు తెలిపారు.
Karma is strange isn't it @GotabayaR?
— Munza Mushtaq (@munza14) July 14, 2022
Remember how you got Gnanasara to lead the anti-halal campaign in 2013 and the successive anti-Muslim attacks and harassment you've led?
But yesterday, you took refuge in a Muslim country, and today you fly in a Arab airline! #LKA #SriLanka
ఎన్ని దేశాలు?
అధ్యక్షుడు గొటబాయ, ఆయన సతీమణి, వారి వెంట ఇద్దరు భద్రతా సిబ్బంది సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లినట్లు శ్రీలంక వైమానిక దళం బుధవారం ప్రకటించింది. బుధవారం వేకువజామున 3 గంటలకు గొటబాయ.. శ్రీలంక నుంచి మాల్దీవులకు పరారయ్యారు. అయితే అక్కడ కూడా గొటబాయకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో గొటబాయ.. సింగపూర్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మాల్దీవుల నుంచి సౌదీ అరేబియా వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Protest in Maldives for giving refuge to Sri Lanka’s President Gotabaya Rajapaksa! pic.twitter.com/JLyel1JHfb
— Ashok Swain (@ashoswai) July 13, 2022
ప్రజల నిరసనలు
అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని రణిల్ విక్రమ సింఘేను అధికారం నుంచి దింపాలని ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేశారు. అధికారిక నివాసాలను ఆక్రమించారు. అయితే తాజాగా వాటిని ఖాళీ చేసేందుకు గురువారం అంగీకరించారు. అయితే, తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కీలక ప్రకటన
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే ఇటీవల సైన్యానికి కీలక ఆదేశాలిచ్చారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలో అది చేయండని, అవసరమైతే కనిపిస్తే కాల్చేయండని సైన్యానికి అధికారం ఇచ్చారు.
దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తప్పుకునేలా చేయాలని విధ్వంసకారులు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు శ్రీలంక పోలీసులు, సైన్యానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘే స్పష్టం చేశారు.
Also Read: Suspicious Cylinder In J&K: జమ్ముకశ్మీర్‌లో అనుమానాస్పద సిలిండర్ స్వాధీనం!
Also Read: Dalai Lama J&K Visit: కీలక సమయంలో జమ్ముకశ్మీర్‌లో దలై లామా పర్యటన!