Suspicious Cylinder In J&K: జమ్ముకశ్మీర్‌లో అనుమానాస్పద సిలిండర్ స్వాధీనం!
Suspicious Cylinder In J&K: జమ్ముకశ్మీర్‌లో ఓ అనుమానాస్పద సిలిండర్‌ను గుర్తించిన బలగాలు ధ్వంసం చేశాయి.
Suspicious Cylinder In J&K: జమ్ముకశ్మీర్‌లో ఓ అనుమానాస్పద సిలిండర్‌ను గుర్తించారు భద్రతా సిబ్బంది. జమ్ము డివిజన్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఈ అనుమానాస్పద సిలిండర్ లభ్యమైంది. దీంతో బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.
అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ధ్వంసం చేశారు. ఈ సిలిండర్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై బలగాలు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉగ్ర కుట్ర
గురువారం ఉదయం దోమన అసెంబ్లీ నియోజకవర్గం కానా చక్క్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పరాగ్వల్ రోడ్ సమీపంలో ఈ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్‌ను గుర్తించిన ప్రదేశానికి కేవలం వంద మీటర్ల దూరంలో ఆర్మీ యూనిట్ ఉంది.
#WATCH | Bomb squad defuses a suspicious cylinder that was found in the Akhnoor sector of Jammu & Kashmir. pic.twitter.com/B1XyGb87H3
— ANI (@ANI) July 14, 2022
సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి తరలించారు.
కొద్దిసేపు భద్రతా బలగాలు రోడ్డును మూసివేశాయి. ఇదే సమయంలో రాకపోకలను సైతం నిలిపివేశారు. ఆ తర్వాత సురక్షిత ప్రాంతానికి తరలించి సిలిండర్‌ను జేసీబీ సహాయంతో గుంత తీసి, అందులో వేసి ధ్వంసం చేశారు. సిలిండర్‌ను ధ్వంసం చేయడంతో భద్రతా సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సిలిండర్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు, బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి.
మోదీ టార్గెట్‌గా
మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా పన్నిన ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న ప్రధాని మోదీ బిహార్ పర్యటనలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు ఈ ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాని మోదీ లక్ష్యంగా ఈ నెల 6,7 తేదీల్లో సమావేశమై వీరు ఉగ్ర కుట్రకు ప్రణాళికలు రచించినట్లు పోలీసుల తెలిపారు. అనుమానిత ఉగ్రవాదుల పుల్వారి షరీఫ్ కార్యాలయంపై బిహార్ పోలీసులు దాడులు నిర్వహించగా పలు పత్రాలు, ఉగ్ర సాహిత్యాన్ని సీజ్ చేశారు.
Also Read: Dalai Lama J&K Visit: కీలక సమయంలో జమ్ముకశ్మీర్‌లో దలై లామా పర్యటన!
Also Read: Amarnath Yatra Suspended: అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేకులు- ఇదే కారణం!