Sri Lanka Political Crisis: శ్రీలంక అధ్యక్షుడి భవనంలో భారీగా కరెన్సీ కట్టలు!
Sri Lanka Political Crisis: శ్రీలంక అధ్యక్షుని నివాసంలో ఆందోళనకారులు భారీగా కరెన్సీని గుర్తించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Sri Lanka Political Crisis: శ్రీలంకలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటికే అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆందోళనకారులు. దీంతో అధ్యక్ష పదవికి జులై 13న రాజీనామా చేస్తున్నట్లు గొటబాయ రాజపక్స ప్రకటించారు.
ప్రధాని రణిల్ విక్రమ సింఘే కూడా ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే అధ్యక్షుడు గొటబాయ నివాసంలో నిరసనకారులు భారీగా కరెన్సీ కట్లను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
భారీగా నోట్ల కట్టలు
అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న నిరసనకారులకు అక్కడ భారీగా నోట్ల కట్టలు కనిపించినట్లు సమాచారం. నిరసనకారులు స్వాధీనం చేసుకున్న సొత్తును భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై దర్యాప్తు చేసిన తర్వాతే నిజానిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు.
Governments everywhere, get ready to run.
— Jennifer Arcuri (@Jennifer_Arcuri) July 9, 2022
We are coming for you ALL 💪🔥💪#SriLanka 👇 pic.twitter.com/ll9WGJVDzX
భవనంలో ఏసీలు నిరంతరం నడుస్తున్నాయని ఆందోళనకారులు మండిపడ్డారు. దేశంలో విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ ఇక్కడి పరిస్థితి మాత్రం అలా లేదన్నారు.
These words from an ordinary man from #SriLanka must reach every leadership in the rest Asia and Africa.
— TK_Nala (@NalaThokozane) July 10, 2022
We vote u in power, but instead of delivering services u get bodyguards to protect u from us. #SriLankaProtests pic.twitter.com/9mFGkkiWw6
భారత్ మాట
శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక ప్రకటన చేశారు. శ్రీలంకకు మద్దతు ఇస్తున్నామని, సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు భారత్ తన వంతు సాయం చేస్తుందన్నారు.
మరోవైపు పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశం లభించిందని, ఇందుకోసం ప్రజలు తమకు సహకరించాలని శ్రీలంక సైన్యాధిపతి శవేంద్ర సిల్వా కోరారు.
Also Read: Shooting In Johannesburg: బార్‌లో విచక్షణా రహితంగా కాల్పులు- 14 మంది మృతి
Also Read: Pending Cases in India: దేశంలో ఉన్న అన్ని కోర్టుల్లో మొత్తం పెండింగ్ కేసులు ఎన్నో తెలుసా?