News
News
X

Pending Cases in India: దేశంలో ఉన్న అన్ని కోర్టుల్లో మొత్తం పెండింగ్‌ కేసులు ఎన్నో తెలుసా?

Pending Cases in India: దేశంలో మొత్తం ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నయనే విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు.

FOLLOW US: 

Pending Cases in India: దేశంలో ఉన్న మొత్తం కోర్టుల్లో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసా? వేలల్లో ఉన్నాయి అనుకుంటున్నారా? లక్షల్లో.. కాదు దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు.

ఔరంగాబాద్‌లోని మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజుజు ఇలా అన్నారు.

" దేశంలోని అన్ని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై చర్యలు తీసుకోకపోతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.  నేను న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య నాలుగు కోట్లకు దగ్గరగా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 5 కోట్లకు దగ్గరగా ఉంది. ఇది మనందరికీ ఆందోళన కలిగిస్తోంది. న్యాయ నిపుణులను నియమించుకోవడం సాధారణ ప్రజలకు చాలా కష్టసాధ్యమవుతుంది.                                                                         "
-  కిరణ్ రిజుజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి

భారత న్యాయవ్యవస్థ

" భారత న్యాయవ్యవస్థ నాణ్యత, గౌరవం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. నేను ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లాను. అక్కడ న్యాయవ్యవస్థకు చెందిన కొంతమందితో భేటీ అయ్యాను. వారికి కూడా భారత న్యాయవ్యవస్థపై మనలాంటి గౌరవమే ఉంది. మన సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులను అప్పుడప్పుడు యూకేలో కొన్ని కేసుల్లో రిఫర్ చేస్తారని వారు తెలిపారు.  "
-  కిరణ్ రిజుజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి

యూకేలో

" యూకేలో ఒక్కరోజులో మూడు నుంచి నాలుగు కేసులకు మాత్రమే న్యాయమూర్తులు తీర్పు ఇస్తారు. కానీ భారత్‌లో ప్రతి న్యాయమూర్తి రోజులో కనీసం 40-50 కేసులు విచారిస్తారు. అంటే మన న్యాయమూర్తులు ఎంత సమయం ఎక్కువగా పనిచేస్తున్నారో చూడండి. ప్రజలకు నాణ్యమైన తీర్పులు కోరుకుంటున్నారు. కానీ న్యాయమూర్తులు కూడా మానవమాత్రులే కదా. "
-                                                కిరణ్ రిజిజు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి

సొంత అభిప్రాయాలు

" ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరూ అంశాన్ని లోతుగా విశ్లేషించకుండానే ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. వారికి వారే న్యాయమూర్తులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. "
-                                                కిరణ్ రిజిజు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి

Also Read: Chinese Man With Ovaries: జంబలకిడిపంబగా మారిన జీవితం- 20 ఏళ్లుగా ఆ వ్యక్తికి రుతుక్రమం!

Also Read: Amarnath Flash Floods: అమర్‌నాథ్ వరదల్లో 16కు చేరిన మృతుల సంఖ్య- రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు

Published at : 10 Jul 2022 02:14 PM (IST) Tags: Kiren Rijiju Law Minister 5 Crore Cases Pending In Indian Courts Pending Cases in India

సంబంధిత కథనాలు

Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని

Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?