News
News
X

Chinese Man With Ovaries: జంబలకిడిపంబగా మారిన జీవితం- 20 ఏళ్లుగా ఆ వ్యక్తికి రుతుక్రమం!

Chinese Man With Ovaries: ఓ వ్యక్తికి గత 20 ఏళ్లుగా రుతుక్రమం అవుతోంది. దీంతో అతను షాక్ అయ్యాడు. చివరికి ఏమైందంటే?

FOLLOW US: 

Chinese Man With Ovaries: జంబలకిడిపంబ సినిమా చూశారా? అందులో పురుషులంతా.. మహిళలుగా మారిపోయి ఇంటి పనులు, వంటపనులు చేస్తుంటారు. మహిళలేమో పురుషులు చేసే పనులు చేస్తుంటారు. మంచి కామెడీగా ఉండే ఆ సినిమాయే నిజజీవితంగా మారిపోతే? పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదా? అవును చైనాలో తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే బయటపడింది.

ఇదీ జరిగింది

చైనాలో ఓ పురుషుడికి (33) గత 20 ఏళ్లుగా రుతుక్రమం అవుతోంది. అయితే దీన్ని అతను లైట్‌గా తీసుకున్నాడు. కానీ ఓ రోజు మూత్రంలో ర‌క్తం, తీవ్ర‌మైన క‌డుపునొప్పి రావ‌డంతో అతను ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స అందించిన వైద్యులు అతడికి షాకింగ్‌ వార్త చెప్పారు.

అత‌డికి గ‌ర్భాశ‌యం ఉందని, అండాలు విడుద‌ల‌వుతున్నట్లు తెలిపారు. జీవ‌శాస్త్ర‌ప‌రంగా అత‌డు మ‌హిళ అని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా అతడు అవాక్కయ్యాడు. 

20 ఏళ్లుగా 

గత 20 ఏళ్ల నుంచి అతని మూత్రంలో రక్తం వస్తూనే ఉంది. అయితే యుక్తవయస్సులో ఉన్న‌ప్పుడు మూత్రవిసర్జన స‌మ‌స్య ఉండ‌డంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అత‌డికి మూత్రంలో రక్తంతోపాటు సాధారణ పొత్తికడుపు నొప్పి వ‌స్తున్న‌ది. ఇటీవ‌ల క‌డుపునొప్పి నాలుగు గంట‌ల‌కుపైగా కొన‌సాగ‌డంతో డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాడు. వైద్యుడు అతనికి అపెండిసైటిస్ అని నిర్ధారించారు. అనతరం ఆపరేషన్‌ చేసినప్పటికీ కడుపు నొప్పి తగ్గలేదు. 

స్కానింగ్‌లో

కడుపునొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో బాధితుడికి స్కానింగ్‌ తీశారు వైద్యులు. దీంతో అసలు విషయం బయటపడింది. అత‌నికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు.

అందులోనూ ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో హార్మోన్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. చివరకు రుతుక్ర‌మం వ‌ల్లే ఇలా మూత్రంలో రక్తం వస్తుందని తేల్చారు.

ఆపరేషన్

దీంతో ఆ వ్యక్తికి ఆపరేషన్ చేశారు వైద్యులు. తనకున్న స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొలగించే శస్త్రచికిత్సను గత నెలలో చేశారు. అది విజయవంతం అయింది. అయితే అతను ఎప్పటికీ తండ్రి అయ్యే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. ఎందుకంటే అతని టెస్టికల్స్ స్పెర్మ్ (వీర్య కణాలు)ను ప్రొడ్యూస్ చేయలేవని నిర్ధారించారు.

Also Read: Amarnath Flash Floods: అమర్‌నాథ్ వరదల్లో 16కు చేరిన మృతుల సంఖ్య- రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 18,257 మందికి కరోనా- ఎంత మంది మృతి చెందారంటే?

Published at : 10 Jul 2022 12:58 PM (IST) Tags: Chinese man urinary issues ovaries menstruating for 20 years Chinese Man With Ovaries

సంబంధిత కథనాలు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

Salman Rushdie : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం, కత్తితో దాడి చేసిన దుండగుడు

Salman Rushdie : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం, కత్తితో దాడి చేసిన దుండగుడు

టాప్ స్టోరీస్

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో