Shooting In Johannesburg: బార్‌లో విచక్షణా రహితంగా కాల్పులు- 14 మంది మృతి
Shooting In Johannesburg: దక్షిణాఫ్రికాలోని ఓ బార్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారు.
Shooting In Johannesburg: దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ కాల్పులతో దద్దరిల్లింది. ఓ బార్‌లో జరిగిన భారీ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరి కొంతమంది గాయపడ్డారు.
#UPDATE The shooting in Pietermaritzburg took place towards 08:30 pm (1830 GMT) and left eight others injured, local police spokesman Nqobile Gwala says.
— AFP News Agency (@AFP) July 10, 2022
It comes on the heels of 14 people dead in a Soweto shootout
ఇదీ జరిగింది
జోహన్నెస్‌బర్గ్‌లోని సోవెటో టౌన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి కొందరు వ్యక్తులు మినీ బస్ ట్యాక్సీలో ఒక బార్ వద్దకు వచ్చారు. అక్కడ వినోదంలో మునిగి ఉన్న వారిపై విచక్షణా రహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో బార్‌లోని వ్యక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
ఈ సంఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తోన్న సమయంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 14కు చేరింది. ఆదివారం ఉదయం మృతదేహాలను వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు.
BREAKING: South Africa police say a shooting at a tavern in Johannesburg’s Soweto township has killed 14 people and left three others in critical condition. https://t.co/zbi4849KhU
— AP Africa (@AP_Africa) July 10, 2022
ఎవరు చేసి ఉంటారు?
ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సంఘటనా స్థలంలో లభించిన తుపాకీ గుళ్ల ఆధారంగా ఓ గ్యాంగ్ సామూహిక కాల్పులకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
బార్‌లో వ్యక్తులు ఎంజాయ్ చేస్తున్న సమయంలో దుండగులు వారిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అయితే హంతకులు కాల్పులు ఎందుకు చేశారనే విషయం ఇంకా తెలియలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Pending Cases in India: దేశంలో ఉన్న అన్ని కోర్టుల్లో మొత్తం పెండింగ్ కేసులు ఎన్నో తెలుసా?
Also Read: Chinese Man With Ovaries: జంబలకిడిపంబగా మారిన జీవితం- 20 ఏళ్లుగా ఆ వ్యక్తికి రుతుక్రమం!