By: ABP Desam | Updated at : 23 Mar 2022 12:45 PM (IST)
Edited By: Murali Krishna
పుతిన్‌తో పెట్టుకుంటే అంతే- రష్యా ప్రతిపక్ష నేతకు 9 ఏళ్ల జైలు శిక్ష
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి కోర్టులో షాక్ తగిలింది. మోసం, కోర్టు ధిక్కరణ అభియోగాలకు సంబంధించిన కేసుల్లో నావల్నీని కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు తొమ్మిదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు రూ.8.75 లక్షల జరిమానా చెల్లించాలని కూడా అందులో పేర్కొంది. తాజా తీర్పుపై నావల్నీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది.
పుతిన్‌తో అంతే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నావల్నీ రాజకీయాల్లో బద్ధ శత్రువు. ఆయన్ను దీర్ఘకాలంపాటు జైలుకు పరిమితం చేసేందుకుగాను దురుద్దేశపూర్వకంగా తప్పుడు అభియోగాలు మోపినట్లు పుతిన్‌పై విమర్శలు వస్తున్నాయి.
నావల్నీ 2021 జనవరిలో అరెస్టయ్యారు. ఓ పాత కేసులో పెరోల్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇప్పటికే రెండున్నరేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
ఇదే కేసు
2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలను కూడా నావల్నీ ఎదుర్కొంటున్నారు. 2020లో ఆయనపై విష ప్రయోగం జరిగింది. అనంతరం చికిత్స తర్వాత 2021 జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం నావల్నీని జైలుకు తరలించారు. అక్కడి జైలు అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలతో నావల్నీ నిరాహార దీక్ష కూడా చేశారు.
అయితే, అధ్యక్షుడు పుతిన్ నావల్నీని హత్య చేయించేందుకు ప్రయత్నం చేసినట్లు వచ్చిన ఆరోపణలను క్రెమ్లిన్ ఖండించింది. అయితే, ప్రతిపక్ష నాయకుడి అరెస్టును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. కానీ పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఏకంగా నావల్నీకి 9 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఉక్రెయిన్‌పై యుద్ధంలోనూ పుతిన్ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా లెక్కచేయడం లేదు. తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టబోమని పుతిన్ తేల్చిచెప్పారు. దాదాపు నెల రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోంది.
Also Read: Russia Ukraine War: రష్యా అంటే నాటోకు భయం- ఊ అంటారా ఊఊ అంటారా: జెలెన్‌స్కీ
Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!
Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్