Tamil Nadu Hindi ban: స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం - తమిళనాడులో హిందీ సినిమాలు, పాటలు, హోర్డింగ్స్ పై నిషేధం
Tamil Nadu govt: తమిళనాడు ప్రభుత్వం హిందీ వ్యతిరేకతను పూర్తి స్థాయిలో చట్టంగా ారుసోతంది. హోర్డింగ్స్, సినిమాలు, పాటలపై బ్యాన్ విధిస్తూ బిల్లు ప్రవేశ పెడుతోంది.

Tamil Nadu govt to introduce bill banning Hindi: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, హిందీ భాషపై నిషేధం విధించే చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా హిందీలో హోర్డింగ్స్ , బోర్డులు, సినిమాలు, పాటలు, పబ్లిక్ ఈవెంట్‌లలో హిందీ ఉపయోగాన్ని నిషేధిస్తుంది. ఈ బిల్‌ను అసెంబ్లీలో స్టాలిన్ ప్రవేశపెట్టనున్నారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీ రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టం తీసుకు వస్తున్నామని చెబుతున్నారు. తమిళ భాష, సంస్కృతి రక్షణకు కట్టుబడి ఉందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ బిల్ ప్రకారం:
హోర్డింగ్స్, బోర్డులు: పబ్లిక్ ప్రదేశాల్లో, వ్యాపారాల్లో హిందీలో ప్రకటనలు, సైన్‌బోర్డులు నిషేధం. తమిళ భాషను ప్రాధాన్యత ఇవ్వాలి.
సినిమాలు, పాటలు: థియేటర్లలో, పబ్లిక్ ఈవెంట్‌లలో హిందీ సినిమాలు, పాటలు ప్రదర్శించడం, ప్లే చేయడం బ్యాన్. తమిళ సినిమాలు, పాటలకు ప్రోత్సాహం.
ఇతర నిషేధాలు: రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా హిందీ ఉపయోగం శిక్షార్హం. ఇది రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
🚨Tamil Nadu govt to introduce bill banning Hindi in the state
— Arjun* (@mxtaverse) October 15, 2025
"Chief Minister M.K. Stalin will present the legislation on the final day of the assembly session, aiming to prohibit Hindi hoardings and Hindi-language films across Tamil Nadu." (Economic Times) pic.twitter.com/w5LfEn9VZh
ఈ బిల్‌ను రూపొందించడానికి లీగల్ ఎక్స్‌పర్టులతో ఎమర్జెన్సీ మీటింగ్ ఇప్పటికే నిర్వహించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రి కె. పొన్ముడి ఇది తమిళ భాషకు గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమేనని చెబుతున్నారు. ఈ చట్టం ఆమోదం పొందితే, భారతదేశంలో భాషా సంబంధిత చట్టాల్లో అత్యంత కఠినమైనది అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా 'త్రీ-లాంగ్వేజ్ ఫార్ములా' (తమిళ, ఇంగ్లీష్, హిందీ)ను డీఎంకే వ్యతిరేకిస్తోంది. డీఎంకే దీన్ని 'హిందీ బలవంతంగా రుద్దడం'గా చూస్తోంది. హిందీ నేర్చుకోవాలని బలవంతం చేస్తే తమిళుల ఆత్మగౌరవంతో ఆడుకోవడమేనని స్టాలిన్ చెబుతున్నారు. తమిళనాడు 'టూ-లాంగ్వేజ్ పాలసీ' (తమిళ, ఇంగ్లీష్) వల్ల విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్‌లో ముందుందని ఆయన పేర్కొన్నారు.ఈ మేలకు పాలసీని కూడా తీసుకు వచ్చారు.
DMK govt reportedly mulls bill to ban Hindi songs, films, and hoardings across the state.
— The Tatva (@thetatvaindia) October 15, 2025
The move marks a key step in the state’s opposition to what it terms 'Hindi imposition'.#TamilNadu #HindiImposition #Language #MKStalin pic.twitter.com/rpV0NmcOhi
బీజేపీ ఈ చర్యను 'అసాధారణం, రాజకీయ డైవర్షన్'గా విమర్శించింది. తమిళనాడులో హిందీ వ్యతిరేకత 1930లు, 1950ల అంటీ-హిందీ ఆందోళనల నుంచి మొదలైంది. ఈ బిల్ 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చినందున, ఓటర్ల పోలరైజేషన్‌కు దారి తీస్తుందని విమర్శకులు అంచనా వేస్తున్నారు.





















