Russia Ukraine War: మూడో ప్రపంచ యుద్ధంపై మరోసారి రష్యా హెచ్చరికలు- ఈసారి డోసు పెంచిందే!
Russia Ukraine War: ఉక్రెయిన్‌కు ఇతర దేశాలు సాయం చేయడంపై రష్యా మరోసారి హెచ్చరించింది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవమని పేర్కొంది.
Russia Ukraine War: ఉక్రెయిన్‌కు అమెరికా సహా ఇతర దేశాలు మద్దతు పలకడంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను సమకూరుస్తామని ఇతర దేశాలు చెప్పడం మూడో ప్రపంచం యుద్ధం ముప్పును తెలియజేస్తుందని హెచ్చరించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలను సరఫరా చేసేందుకు అమెరికా దాని మిత్రదేశాలు సిద్ధమవుతోన్న వేళ రష్యా ఈ విధంగా స్పందించింది.
అమెరికా సాయం
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వ్యాఖ్యానించారు.
రహస్య పర్యటన
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, పోలాండ్, బాల్టిక్ దేశాల అధినేతలు ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించారు. తాజాగా అమెరికా కీలక మంత్రులు కూడా యుద్ధ భూమి ఉక్రెయిన్‌లో పర్యటించి తమ సంఘీభావం తెలిపారు. అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆదివారం పర్యటించారు.
యుద్ధం మొదలైన రెండు నెలల్లో ఉక్రెయిన్ వచ్చిన అమెరికా ఉన్నత స్థాయి నాయకులు వీరే. రహస్యంగా సాగిన పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మూడు, నాలుగు గంటలు వీళ్లు సమావేశమయ్యారు.
Also Read: Tej Pratap Yadav: లాలూకు మరో షాక్- పార్టీకి పెద్ద కుమారుడు గుడ్‌బై