అన్వేషించండి

Russia Ukraine War: 4 వారాల్లో ప్రపంచాన్నే మార్చేసిన రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- నెగ్గేదెవరు? తగ్గేదెవరు?

30 రోజుల రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు పైచేయి సాధించారు? ఉక్రెయిన్ ఇంకెంత కాలం రష్యాను నిలువరించగలదు?

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై నేటికి సరిగ్గా నెల రోజులు. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్లు ఫిబ్రవరి 24 ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఎవరైనా మధ్యలో తల దూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ నెల రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి, ఎన్నో నగరాలను హస్తగతం చేసుకున్నాయి. ఇది పైకి కనిపించేది. అయితే యూరోప్ దశాబ్దాలుగా చూడని హింసాత్మక ఘటనలను ఈ నెల రోజుల్లో చూసింది. రష్యా మొదలుపెట్టిన ఈ దాడి వల్ల మాస్కోకు, పశ్చిమ దేశాలకు మధ్య ఇక పూడ్చలేని దూరం ఏర్పడింది. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ఆకలి చావులు మొదలయ్యే పరస్థితులు కనిపిస్తున్నాయి.

రష్యా మొదలుపెట్టిన ఈ దాడి ఇప్పట్లో పూర్తి కాదని ఐరోపా నిఘా విభాగాలు ముందే అంచనా వేశాయి. అయితే ఇది ప్రపంచాన్నే వణికిస్తుందని మాత్రం అనుకోలేదు. ఉక్రెయిన్‌ను నామ రూపాల్లేకుండా చేయడానికి రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఐరోపా దేశాలకు యుద్ధం మొదలైన తర్వాతే అర్థమైంది.

ఉక్రెయిన్ జవాబు

బలమైన రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ కూడా అంతే దీటుగా ఎదుర్కొంటోంది. డజనుకు పైగా ఉన్న మిత్రదేశాలు, అమెరికా కూడా ఉక్రెయిన్‌కు పరోక్షంగా సాయమందిస్తున్నాయి. అన్నింటిని మించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ మాటలు ఆ దేశ సైన్యాన్ని అలుపెరగకుండా పోరేడేలా చేస్తున్నాయి.

అమెరికా పాత్ర

ఈ నెలరోజుల యుద్ధంలో అమెరికా పాత్ర కూడా ఎక్కువే ఉంది. ముఖ్యంగా అమెరికా ఎన్నడూ చూడని విదేశాంగ విధానాలు ఇప్పడు అవలంబించాల్సి వచ్చింది. ఇప్పటివరకు చైనానే శత్రువుగా చూసిన అమెరికా.. ఈ యుద్ధం వల్ల రష్యాపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ బుధవారం అత్యవసర నాటో సమావేశానికి హాజరయ్యారు. అమెరికా మిత్ర దేశాలు.. రష్యాపై వీలైనన్నీ ఆర్థిక ఆంక్షలు విధించాలని బైడెన్ కోరారు. అయితే అణ్వాయుధాలు కలిగిన రష్యాతో నేరుగా యుద్ధం చేయడం ప్రపంచానికి ప్రమాదకరమని అమెరికా భావిస్తోంది.

ఆయుధ సాయం

రష్యా సైన్యంతో పోరాడేందుకు తమ బలగాలను పంపడానికి ఐరోపా దేశాలు వెనకాడుతున్నప్పటికీ ఆయుధ సామగ్రిని మాత్రం పంపిస్తున్నాయి. పశ్చిమ దేశాల వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతోనే ఉక్రెయిన్.. ఇన్నాళ్లపాటు రష్యాను అడ్డుకోగలిగింది. అయితే ఈ యుద్ధంలో విజయం సాధించడం రష్యా, ఉక్రెయిన్‌కు అంత సులువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోజులు గడుస్తోన్న కొద్ది రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత హింసాత్మకంగా మారుతోంది.

" బలమైన రష్యా సైనిక శక్తిని ఉక్రెయిన్ ఇంకెంత కాలం నిలువరిస్తుందో అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అయితే రోజురోజుకు ఉక్రెయిన్ సైనిక సామర్థ్యం కూడా తగ్గుతోంది. ఐరోపా దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఎంత వేగంగా సాయం అందుతుంది అనే దానిపైనే వారి పోరాటం ఆధారపడి ఉంది. దీంతో పాటు ఉక్రెయిన్ వాసులు ఇంకెంత కాలం ఈ యుద్ధాన్ని భరిస్తారో చూడాలి.                                               "
-కైర్ గిల్స్, రష్యా సైనిక నిపుణుడు

ఏం చెప్పాలి?

ప్రశాంత, సుందరమైన దేశంలో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ యుద్ధ ట్యాంకులు కనిపించాయి. బతుకు జీవుడా అంటూ సాగే సామాన్యుల బతుకులు ఛిద్రమైపోయాయి. తమకు కావాల్సిన వాళ్లను, భార్యా బిడ్నల్ని విడిచిపెట్టి ప్రాణాలు కోల్పోయిన జీవితాలు ఎందరివో, దూరంగా బతుకుతోన్న వారు మరెందరో. 30 రోజుల్లో ఎంత మంది జీవితాలు తలకిందులయ్యాయో మీరే చూడండి.

ఉక్రెయిన్ జనాభాలో పావు వంతు అంటే కోటి మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వలసవెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, మాల్డోవాకు కూడా చాలా మంది శరణార్థులుగా వెళ్లిపోయారు.

రష్యాకు నష్టం?

యుద్ధంలో ఉక్రెయిన్ నష్టం గురించే అందరూ మాట్లాడుతున్నారు. కానీ రష్యాకు ఏ మేర నష్టం కలిగిందో క్రెమ్లిన్ పూర్తిగా చెప్పడం లేదు. అయితే నాటో అధికారి ఒకరు మాత్రం.. నాలుగు వారాల్లో రష్యాకు చెందిన 7 వేల నుంచి 15 వేల మంది సైనికులు మృతి చెంది ఉంటారని తెలిపారు. మరో 30 వేలన నుంచి 40 వేల మంది సైనికులకు గాయాలు కావడం, బందీలుగా దొరకడం, కనపడకుండా పోవడం వంటివి జరిగి ఉంటాయని వెల్లడించారు. 

మరోవైపు ఈ యుద్ధంలో 2,500 మంది వరకు పౌరులు మృతి చెంది ఉంటారని ఐరాస తెలిపింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ లాంటి నగరాలు ధ్వంసమయ్యాయి. దక్షిణ నగరమైన మరియూపోల్‌ను కూడా రష్యా బలగాలు ముట్టడించాయి.

రష్యాకు ఎదురుదెబ్బ

2014లో క్రిమియాను ఆక్రమించిన సమయంలో రష్యా సైన్యం చాలా వేగంగా పని పూర్తి చేసింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలోనూ ఇదే ప్లాన్ అమలు చేయాలని పుతిన్ భావించారు. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ నగరాలను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని కూల్చేసి తమకు నచ్చిన వారితో తోలుబొమ్మ సర్కార్ ఏర్పాటు చేయించాలని పుతిన్ ప్రణాళిక రచించారు.

కానీ యుద్ధం మొదలైన ఐదో రోజుకే ఇది అంత సులభం కాదని పుతిన్‌కు అర్థమైంది. అందుకే రష్యా లాంటి బలమైన సైన్యానికి కూడా ఉక్రెయిన్‌ ఇంకా చేజిక్కలేదు. దీంతో పుతిన్ ప్లాన్- బీ అమలుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, నివాసాలు ఇలా వీటిపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు.

జెలెన్‌స్కీ హీరో

ఈ యుద్ధంతో ఐరోపా సహా ప్రపంచవ్యాప్తంగా జెలెన్‌స్కీ హీరో అయిపోయారు. రాజధాని కీవ్ నగరంలో రష్యా వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ అక్కడి నుంచే జెలెన్‌స్కీ రోజూ వీడియోలు పెడుతున్నారు. మరోవైపు 23 ఏళ్లలో నిర్మించుకున్న పుతిన్ ఇమేజ్.. ఈ యుద్ధంతో కాస్త తగ్గింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులుSiddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget