అన్వేషించండి

Russia Ukraine War: ముడి చమురు బ్యారెల్ ధర 300 డాలర్లకు చేరుతుంది : రష్యా నేత షాకింగ్ కామెంట్స్

Russia Ukraine Conflict: రష్యా చమురు దిగుమతులపై నిషేధం మరిన్ని పర్యవసానాలకు దారి తీస్తుందని రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ హెచ్చరించారు.

Oil Prices Will Hit 300 Dollar A Barrel: ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. మూడు దఫాలుగా ఉక్రెయిన్, రష్యా నేతల మధ్య చర్చలు జరిగినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో క్రూడాయిల్ ధరలు జీవిత కాల గరిష్టానికి చేరతాయిని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ముడి చమురు ధరల పెరుగుదలపై రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ కీలక ప్రకటన చేశారు.

300 డాలర్లకు ఎగబాకనున్న ముడి చమురు 
రష్యా చమురు దిగుమతులపై నిషేధం మరిన్ని పర్యవసానాలకు దారి తీస్తుందని అలెగ్జాండర్ నోవాక్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దాడులతో మాస్కోపై ఆంక్షలు మరింతగా పెరుగుతున్నాయి. రష్యా నుంచి ఎగుమతి అయ్యే ముడి చమురుపై అమెరికా, యూరప్ దేశాల నిషేధం (US, Europe Ban Imports Of Crude Oil) ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ బ్యారెల్ ధర 300 డాలర్ల దాటే అవకాశం ఉందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారని రష్యా మీడియా రిపోర్ట్ చేసింది. 

రష్యా ఎగుమతులపై నిషేధం.. 
యూరోపియన్ మార్కెట్లో రష్యా అందించే ముడి చమురును ఇతర దేశాలు సరఫరా చేయడం అసాధ్యం. కేవలం ఆరు నెలలో, లేక ఓ ఏడాది పాటు యూరప్ కస్టమర్లు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇదే విషయాన్ని రష్యా ప్రభుత్వం తమ పౌరులకు వాస్తవ పరిస్థితి (Russia Ukraine War)ని వెల్లడించి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నోవాక్ పేర్కొన్నారు. యూరప్ దేశాలు, అమెరికా లాంటి ఇతర దేశాలు రష్యా ముడి చమురుపై నిషేధం మరింతకాలం కొనసాగిస్తే అస్థిరత ఏర్పడి, ఇది మార్కెట్లో మరిన్ని ఇబ్బందులకు దారి తీస్తుందని వివరించారు.

నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ ప్రాజెక్ట్ ఆగిపోయినందుకు రష్యా ప్రతీకారంగా నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్ ద్వారా సరఫరాలను నిలిపివేసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. దీని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని నోవాక్ అన్నారు. ఇతర యూరప్ దేశాల నేతలు రష్యాపై కుట్రపూరితంగా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారని రష్యా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నోవాక్ సూచించారు. మూడు రౌండ్ల చర్చల తరువాత సైతం ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేసింది, ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని అధ్యక్షుడు జెలెన్ స్కీని బంధించాలని రష్యా భావిస్తోంది.

Also Read: Putin Photo In Toilet: టాయిలెట్‌లో పుతిన్ ఫొటో, మూత్రం పోస్తూ ప్రతీకారం, రష్యాపై ఇదేం రివేంజ్‌రా అయ్యా!

Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
PMKVY: సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
Sai Pallavi as Ramayan Sita: సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌
సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌
Kalki Movie: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
Embed widget