Putin Photo In Toilet: టాయిలెట్లో పుతిన్ ఫొటో, మూత్రం పోస్తూ ప్రతీకారం, రష్యాపై ఇదేం రివేంజ్‌రా అయ్యా!
రష్యా అధ్యక్షుడిపై ఇప్పుడు చాలామంది కోపంగా ఉన్నారు. అందుకే, ఈ విధంగా రివేంజ్ తీర్చుకుంటున్నారు. ఇంతకీ ఈ టాయిలెట్ ఎక్కడుందో తెలుసా?
Putin Photo in Urinal | ఉక్రెయిన్‌లోకి రష్యా చొరబాటును ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. చివరికి ఆ దేశీయులు కూడా యుద్ధాన్ని స్వాగతించడం లేదు. దీనిపై స్థానిక నిరసనలను సైతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణచివేశారు. ఇక ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో రష్యా వైఖరిని బహిరంగంగానే ఖండిస్తున్నారు. అయితే, రష్యా మాత్రం అవేవీ పట్టనట్లు ముందుకు దూసుకెళ్తోంది. ఉక్రెయిన్ సైతం తమ ప్రయత్నం తాను చేస్తోంది.
రష్యా చర్యలను వ్యతిరేకిస్తున్న దేశాల్లో ప్రజలు రకరకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూకేలోని ఓ పబ్‌లో ఏకంగా పుతిన్ ఫొటోను టాయిలెట్లో పెట్టారు. ఆయన ముఖం మీద మూత్రం పోస్తూ నిరసనకారులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటింగ్‌హామ్‌లోని ‘రగ్లాన్ రోడ్’ అనే ఐరీష్ బార్ టాయిలెట్‌కు వెళ్లినవారు ముసి ముసి నవ్వులతో బయటకు వస్తున్నారు. కొందరైతే.. ఆ ఫొటోపై మూత్రం పోసి ఘనకార్యం చేసినవారిలా ఫీలవ్వుతున్నారు.
Also Read: సోయా తింటే పురుషుల్లో ఆ శక్తి తగ్గుతుందా? సంతానం కష్టమేనా?
చిత్రం ఏమిటంటే.. పుతిన్‌కు ముందు అక్కడ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫొటో ఉండేదట. తమ టాయిలెట్లో పుతిన్ ఫోటోను పెట్టామంటూ ఆ బార్ నిర్వాహకులే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను పోస్ట్ చేయడం గమనార్హం. ఇంకేముంది.. ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారడంతో ఆ టాయిలెట్ వాడేందుకు ప్రజలు ఆ బార్ ముందు బారులు తీరుతున్నారట. ‘‘నేరుగా ఎలాగో ప్రతీకారం తీర్చుకోలేం. కనీసం ఇలాగైనా రివేంజ్ తీర్చుకుందాం’’ అని నెటిజనులు కామెంట్లలో పేర్కొంటున్నారు. మరి, పుతిన్ ఇది చూశాడో లేదో. ఆయన చూసి ‘బాంబు’ వేయడానికి ముందే మీరు చూసేయండి.
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!
ఇదే ఆ టాయిలెట్:
View this post on Instagram
View this post on Instagram