Rare Comet in Sky: ఈనెల 12న ఆకాశంలో అరుదైన ఘటన - 400 ఏళ్లకు ఒక్కసారే ఇలా, మిస్సవ్వకండి!
విశ్వంలో ఎన్నో అద్భుతాలు. వాటిలో కొన్ని మాత్రమే మన కంట పడతాయి. కొన్ని మానవుల జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తున్నాయి.
ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. అరుదైన తోకచుక్క.. గగనతలంలో కపించబోతోంది. 400ఏళ్లకు ఒక సారి వచ్చే ఈ అద్బుత దృశ్యం... ఈనెల 12న ఆవిష్కృతం కాబోతోంది.
విశ్వంలో ఎన్నో అద్భుతాలు. వాటిలో కొన్ని మాత్రమే మన కంట పడతాయి. కొన్ని మానవుల జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తున్నాయి. అలాంటి ఓ అద్భుతం.. త్వరలోనే మన కళ్లను కనిపించబోతోంది. సౌర వ్యవస్థలో 400 ఏళ్లకు ఒకసారి వచ్చే తోకచుక్కు ఆకాశంలో మెరవబోతోంది. దానికి చూసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలతోపాటు.. మానవజాతి మొత్తం ఎదురుచూస్తోంది. ఎందుకంటే... ఆ తోకచుక్క మళ్లీ కనిపించేది 400ఏళ్ల తర్వాతే.
ఆ అరుదైన తోకచుక్క... ఈనెల 12న ఆకాశంలో కనిపంచబోతోంది. ఆ తోకచుక్క పేరు నిషిమురా. జపాన్ శాస్త్రవేత్త హిడియో నిషిమురా... దీన్ని ఈ ఏడాదే ఆగస్ట్ 12న తొలిసారి కనిపెట్టారు. అందుకే దీనికి నిషిమురా అని పేరు పెట్టారు. ఈ తోకచుక్క కిలోమీటర్ పరిమాణంలో ఉంటుంది. ఈనెల 12న... భూమికి 80 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. ఉత్తరార్ధ గోళంలో నివసించే వారికి ఈ తోకచుక్క స్పష్టంగా కనిపిస్తుంది.
ఈనెల 12న... సూర్యోదయానికి కాస్త ముందుగా ఈ తోకచుక్క దర్శనమిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిషిమురా అనే తోకచుక్క తన గమనంలో భాగంగా ఆ రోజున భూమికి అత్యంత దగ్గరగా రానుంది. దీనిని మానవ కన్నులతోనే చూడొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. నిషిమురా తోకచుక్క గంటకు 3లక్షల 86వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కాంతి కాలుష్యం లేని.. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తోక చుక్క కనిపిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ హల్ ప్రొఫెసర్ బ్రాడ్ గిబ్సన్ తెలిపింది. సూర్యోదయానికి గంట ముందు... గంట తర్వాత ఈ ఖగోళ అద్భుతం కనపడుతుందని ఆయన తెలిపారు. ఈశాన్యం వైపు తిరిగి చందమామ, శుక్ర గ్రహాల మధ్యలో చూడాలని సూచించారు.
నిషిమురా తోకచుక్క.. ప్రతి 400 ఏళ్లకు ఒక సారి భూమి దగ్గరకు వస్తుంది.. అందుకే ఇది ఖగోళ అద్భుతమని అంటున్నారు. సెప్టెంబరు 12న ఇది భూమికి దగ్గరగా ప్రయాణించి.. 17వ తేదీ నాటికి సూర్యునికి అత్యంత దగ్గరగా వెళ్తుంది. సూర్యుడ్ని దాటే సమయంలో.. అది విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అయితే.. అది ఆ వేడి తట్టుకుంటుందని కొందరు శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఒకవేళ... నిషిమురా తోకచుక్క సూర్యుడ్ని దాటగలిగితే.. సెప్టెంబరు నెలాఖరు నాటికి దక్షిణ అర్ధగోళంలో కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. సాయంత్రం సంధ్యా సమయంలో హోరిజోన్‌లో ఈ తోకచుక్కు కనిపిస్తుందని చెప్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు వరకు అసలు ఇలాంటి తోకచుక్క ఉందనే విషయమే శాస్త్రవేత్తలకు తెలియదు. ఆ నెల 11న జపాన్‌కు చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ హిడియో నిషిమురా.. నిశితంగా ఆకాశాన్ని గమనిస్తూ పలు ఫొటోలను తీశారు. వాటిలో ఒక తోకచుక్క భూమి వైపు వస్తున్నట్లు గమనించారు. దీంతో శాస్త్రవేత్తలు దానిపై పరిశోధనలు జరిపి వివరాలు తెలుసుకున్నారు. 430ఏళ్లకు ముందు కనిపించిన ఈ తోకచుక్క... మళ్లీ ఇప్పుడు భూముకి దగ్గరగా వస్తుందని నిర్ధారించారు.
నిషిమురా తోకచుక్కను.. నేరుగా కంటితో కాకుండా ఏదైనా పరికరం సాయంతో స్పష్టంగా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కంటితో నేరుగా చూస్తే అస్పష్టంగా ఉంటుందని... బైనాక్యులర్ సాయంతో కచ్చితమైన దిశలో చూస్తే కనిపిస్తుందని చెప్తున్నారు. తెల్లవారుజామున.. సూర్యోదయానికి అరగంట ముందు ఈశాన్య దిక్కున నింగివైపు చూస్తే ఈ తోక చుక్క కనిపిస్తుందంటున్నారు. సూర్యుడికి చేరువయ్యే కొద్దీ ఇది మరింత ప్రకాశవంతంగా మారుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం... అరుదైన తోకచుక్కను చూసేందుకు సిద్ధమైపోదామా.