Pakistan: చైనాలో డిమాండ్, పాక్‌లో గాడిద ధరలకు రెక్కలు.. ఇదీ అసలు విషయం!
ఆర్థిక మాంద్యంలో ఉన్న పాకిస్థాన్‌లోని పేద ప్రజలను మరో సమస్య వెంటాడుతోంది. పాక్‌లోని గాడిదలను చైనా భారీ రేటుకు కొంటుండడంతో వాటిపైనే ఆధారపడి బతుకుతున్న కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Surge in Donkey Prices in Pakistan: ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లోని పేద ప్రజలను మరో సమస్య వెంటాడుతోంది. అదే గాడిదల ధరలు ఆకాశాన్నంటడం. పాక్‌లోని గాడిదలను చైనా భారీ రేటుకు కొంటుండడంతో వాటిపైనే ఆధారపడి బతుకుతున్న కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు రూ.2 లక్షలు వెచ్చించి చైనా కొనుగోలు చేస్తోంది. దీంతో గాడిదలనే జీవనాధారం చేసుకొని బతుకుతున్న కూలీలకు కొత్త గాడిదను కొని జీవనం సాగించలేని పరిస్థితిలో ఉన్నారు.
పాక్‌కు చెందిన అబ్దుల్ రషీద్‌కు టైగర్ అనే గాడిద ఉండేది. ఆ గాడిదే అతడికి ఏకైక ఆదాయ వనరు. అయిన ఆ టైగర్ గత వారం ఓ ప్రమాదంలో మరణించింది. కరాచీతోపాటు పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో గాడిద ధరలు పెరగడంతో.. తీవ్ర పేదరికంలో ఉన్న రషీద్ కొత్త గాడిదలను కొనలేకపోతున్నాడు.
‘ఇప్పుడు మార్కెట్లో గాడిద ధర రూ. 2,00,000 వరకు ఉంది. 8 సంవత్సరాల క్రితం నేను టైగర్‌ను కొనడానికి చెల్లించిన రూ. 30,000 కంటే ఇది చాలా ఎక్కువ’ అని రషీద్ వాపోయాడు. రషీద్ ఒక్కడే కాదు అతడి లాంటి వందలాది మంది వేతన జీవులు గాడిదలనే గాడిదలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు చైనా నుంచి కొనుగోలుదారుల వచ్చి అధిక ధరలకు కొంటుండడంతో వీరు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
గాడిదలను కొంటున్న చైనా సంస్థ
చైనాకు చెందిన భారీ సంస్థ ఎజియావో భారీ మొత్తం వెచ్చించి గాడిదలను కొంటోంది. సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగించే జెలటిన్ అనే మందు కోసం గాడిలను కొనుగోలు చేస్తోంది. గాడిద చర్మాన్ని ఉడికించి, కేంద్రీకరించడం ద్వారా జెలటిన్‌ను తయారు చేస్తారు. మానవ శరీరంలో అలసటను తగ్గించడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే లక్షణాలు, కణితిని అణిచివేయడం, రక్తహీనత నిరోధక ప్రభావం వంటి జీవసంబంధమైన ప్రయోజనాల కోసం జెలటిన్‌ను క్లినిక్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
చైనాలో గాడిదల డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా ఉండడంతో గాడిద చర్మం కోసం చైనా ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్‌లోని అతిపెద్ద గాడిదల మార్కెట్ పై చైనా కన్ను పడింది. కరాచీలోని లియారితో మంచి సంబంధాలు ఉండడంతో అక్కడ చౌకైన ఆరోగ్యకరమైన గాడిదకు రూ.1,55,000 వెచ్చించి కొంటోందని రషీద్ పేర్కొన్నారు.
పాక్‌లోని అనేక పరిశ్రమల్లో గాడిదలు అంతర్భాగం. ఇటుక బట్టీలు, రవాణా, వ్యవసాయం, వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, లాండ్రీ తదితర పరిశ్రమల్లో గాడిదల పాత్ర కీలకం. కూలీలు, కార్మికులు ప్రతిరోజూ తమ గాడిద బండ్లను భారీ వస్తువులను లోడ్ చేయడానికి, మైళ్ల దూరం రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ దూరం వెళ్తే సమద్ కూలీకి రోజువారీ ఆదాయం రూ.1,500 నుంచి రూ. 2,000 వరకు లభిస్తుంది. అందులో దాదాపు సగం డబ్బు గాడిద నిర్వహణకే ఖర్చవుతుంది.
పాకిస్థాన్‌లో పనిచేసే గాడిదల సంఖ్య 5.9 మిలియన్లుగా ఉంటుందని అంచనా. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం గత సంవత్సరంలో ఆ దేశంలో గాడిదల సంఖ్య 1,09,000 పెరిగింది. పాక్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల మంది పేదలు, అణగారిన ప్రజలు ఈక్విడ్‌లపై (గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు) ఆధారపడి ఉన్నారని నివేదికలు చెప్తున్నాయి.




















