Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !
Pak War: ఆప్ఘనిస్తాన్‌తో గొడవ పెట్టుకుని పాకిస్తాన్ యుద్దానికి సిద్దమవుతోంది. తాలిబన్ల చేతిలో చావు దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది.
Pakistan is getting ready for war with Afghanistan: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. పాకిస్తాన్ వైమానిక బాంబు దాడిలో కనీసం 46 మంది ఆఫ్ఘని వాసులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్థాన్ దాడులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకున్న తర్వాత తాజాగా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తాలిబన్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఆప్ఘన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన పాకిస్తాన్
భారత్ లో ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై మన దేశం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఇదే స్ఫూర్తిగా తీసుకుందేమో కానీ పాకిస్తాన్ కూడా తాలిబన్ పాలనలోని అప్ఘనిస్థాన్ పై డిసెంబర్ 24 అర్థరాత్రి వేళ పాకిస్థాన్ బాంబు దాడులు చేసిది. బాంబు దాడుల్ని ఖండించిన తాలిబన్లు.. తమ దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే దెబ్బతీసేలా దాడులు జరిగాయని పాకిస్తాన్ చెబుతోంది. తాలిబన్లకు అండగా నిలిచే ఓ గ్రూప్ తమ దేశంలో టెర్రరిజాన్ని పాల్పడుతోందని ఇలా పాక్ దాడులు చేసింది.
Also Read: భారతీయుల్ని రానివ్వకపోతే టెక్నికల్‌గా దివాలా తీస్తాం - ట్రంప్‌ను హెచ్చరిస్తున్న మస్క్, రామస్వామి !
పాక్ ఆర్మీపై పెరిగిన దాడులు
పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపణలు ఉన్న టీటీపీ అనే సంస్థకు తాలిబన్ అండదండలు ఉన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో.. టీటీపీ గ్రూప్ ను నిర్మూలించేందుకు ఆఫ్ఘన్ తాలిబాన్ నేతల్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ.. ఆ ప్రయత్నం జరగకపోగా, వారిని రక్షించేందుకు పాక్, టీటీపీ మధ్య చర్చలకు తాలిబన్లు మధ్యవర్తిత్వం వహించారు. కానీ అవి విఫలమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని అభయారణ్యాల నుంచి పాకిస్తాన్ భద్రతా దళాలపై టీటీపీ దాడులను ప్రారంభించింది. సరిహద్దుల్లోని ఆర్మీ పోస్టులపై వరుస దాడులు చేస్తూ.. పాకిస్థాన్ సైన్యానికి సవాళు విసురుతున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ లోని రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని.. అక్కడి ఆర్మీ, సైనిక స్థావరాలపై తెహ్రీ-కె-తాలిబాన్ పాకిస్తాన్ వరుస దాడులు చేస్తోంది.
Also Read: యూకే స్టుడెంట్ వీసా రూల్స్ మారాయి - మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?
తీవ్రంగా నష్టపోతున్న పాకిస్తాన్
ఆఫ్ఘన్ కేంద్రంగా తమపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న గ్రూపులతో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతోంది. ఆ దేశానికి ఉన్న ఆయుధ సంపత్తి చాలా తక్కువ.దాన్ని కూడా ఇప్పుడు ఆఫ్ఘన్ పై యుద్ధానికి వాడాల్సి వస్తోంది. ఇక ముందు భారత్ వైపు చూడటానికి కూడా వారికి తీరిక ఉండదు. ఎందుకంటే తాలిబన్లు కొత్తగా కోల్పోవడానికి ఏమీ ఉండదు. పాకిస్తాన్ ను సర్వనాశనం చేయడాన్నే టార్గెట్ గా పెట్టుకుంటారు.