Scientists Capture Plants Talking: ఏవండోయ్ ఇది విన్నారా! మొక్కలు మాట్లాడుకుంటాయ్! తొలిసారి రికార్డ్ చేసిన జపాన్ శాస్త్రవేత్తలు
Plants Talking : మొక్కలకు ప్రాణం ఉంటుందని భారతీయ శాస్త్ర వేత్త జగదీష్ చంద్రబోస్ఎ ప్పుడో నిరూపించారు. ఇప్పుడు.. మాట్లాడుకుంటాయనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నిరూపించారు.
![Scientists Capture Plants Talking: ఏవండోయ్ ఇది విన్నారా! మొక్కలు మాట్లాడుకుంటాయ్! తొలిసారి రికార్డ్ చేసిన జపాన్ శాస్త్రవేత్తలు On Camera Scientists Capture Plants Talking To Each Other For The First Time Scientists Capture Plants Talking: ఏవండోయ్ ఇది విన్నారా! మొక్కలు మాట్లాడుకుంటాయ్! తొలిసారి రికార్డ్ చేసిన జపాన్ శాస్త్రవేత్తలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/36dc14aa1b8599a1abcee84551224b051706068071637215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Plants Talking To Each Other: ఆ.. ఏముంది.. మొక్కలే(Plants) కదా లైట్ తీసుకుంటాం. కానీ, ఒకింత లోతుగా తరచి చూస్తే.. వాటిలోనూ ప్రాణం ఉంటుందని, అవి కూడా మనలానే పర్యవరణానికి అనుకూలంగా స్పందిస్తాయని తెలుసా? అంతేకాదు, మొక్కలు పరస్పరం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని తెలిస్తే.. ఆశ్చర్య పోవడం ఖాయం. తాజాగా మొక్కలు మాట్లాడుకుంటాయన్న విషయాన్ని జపాన్(Japan)కు చెందిన శాస్త్రవేత్తలు(Resercher) ఆధారాలతో సహా నిరూపించారు. మొక్కలు మాట్లాడుతున్న సమయంలో రికార్డయిన సీసీ కెమెరా పుటేజీని జపాన్ శాస్త్రవేత్తలు సాధించారు. దీంతో మొక్కలకు మన లాగే ప్రాణంతోపాటు.. మాటలు కూడా వచ్చనే సంచలన విషయం వెలుగు చూసింది.
ఎప్పుడో చెప్పిన జేసీ బోస్
వాస్తవానికి మొక్కలకు ప్రాణం ఉంటుందని భారతీయ వృక్షశాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్(JC Bose) ఎప్పుడో నిరూపించారు. అంతేకాదు, జంతువులు, మొక్కల కణజాలాల మధ్య సమాంతరతను కూడా ఆయన నిరూపించారు. ఇక, ఇప్పుడు మొక్కలు మాట్లాడుకుంటాయనే సరికొత్త విషయాన్ని జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నిరూపించారు. మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.
`సైన్స్ అలర్ట్` కథనం మేరకు..
మొక్కలు కమ్యూనికేట్(Communicate) చేయడానికి ఉపయోగించే గాలిలో ఉండే సమ్మేళనాల చక్కటి పొగమంచుతో చుట్టుముట్టి ఉంటాయి. ఈ సమ్మేళనాలు వాసనలు(Smells) లాగా ఉంటాయి. సమీపంలోని ప్రమాదం గురించి మొక్కలను హెచ్చరిస్తాయి. జపనీస్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన వీడియోలో మొక్కలు ఏ విధంగా వాతావరణ సంకేతాలను స్వీకరిస్తాయి, ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి అనే విషయాలు వెల్లడయ్యాయి. సైతమా విశ్వవిద్యాలయానికి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు టయోటా నేతృత్వంలోని శాస్త్రవేత్తలబ బృందం సాధించిన ఈ సంచలన అంశాన్ని `నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్`లో ప్రచురించారు. ఈ పరిశోధనలో పీహెచ్‌డీ విద్యార్థి యూరి అరటానీ, పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకురాలు టకుయా ఉమురా పాల్గొన్నారు.
ప్రతిస్పందనలు..
కీటకాలు లేదా ఇతరత్రా దెబ్బతిన్న మొక్కల ద్వారా విడుదలయ్యే అస్థిర కర్బన సమ్మేళనాలకు (VOCs) పాడైపోని మొక్క ఎలా స్పందిస్తుందో శాస్త్రవేత్తల బృందం గమనించింది. "మొక్కలు యాంత్రికంగా లేదా శాకాహారి-దెబ్బతిన్న పొరుగు మొక్కల ద్వారా విడుదలైన VOCలను గ్రహిస్తాయి. వివిధ రక్షణ ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. ఇలాంటి ఇంటర్‌ప్లాంట్ కమ్యూనికేషన్ మొక్కలను పర్యావరణ ముప్పుల నుంచి రక్షిస్తుంది" అని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తెలిపారు.
శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఆకులు(Leafs), గొంగళి పురుగుల కంటైనర్‌కు అనుసంధానించబడిన గాలి పంపును, ఆవాలు(Musterd) కుటుంబానికి చెందిన సాధారణ కలుపు మొక్క.. అరబిడోప్సిస్ థాలియానాతో మరొక పెట్టెను ఉపయోగించారు. టొమాటో మొక్కలు, అరబిడోప్సిస్ థాలియానా నుంచి సేకరించిన ఆకులపై గొంగళి పురుగులను వదిలిపెట్టారు. మరోవైపు, కీటకాలు లేని అరబిడోప్సిస్ మొక్క ప్రతిస్పందనలను సంగ్రహించారు.
బయో సెన్సార్‌తో..
పరిశోధకులు బయోసెన్సార్(Bio Censors)ను జోడించారు, అది ఆకుపచ్చగా మెరుస్తుంది., కాల్షియం అయాన్లను గుర్తించారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది.. మానవ కణాలను కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తాయి. వీడియోలో చూసినట్లుగా, పాడైపోని మొక్కలు తమ గాయపడిన ఇతర మొక్కల నుంచి సందేశాలను అందుకున్నాయి. వాటి ఆకులపై అలలుగా ఉండే కాల్షియం సిగ్నలింగ్‌తో ప్రతిస్పందించాయి. "ఎట్టకేలకు మొక్కలు తమ పొరుగువారి నుంచి గాలిలో వచ్చే హెచ్చరిక సందేశాలకు ఎప్పుడు, ఎక్కడ ఎలా స్పందిస్తాయి అనే క్లిష్టమైన అంశాన్ని మేం ఆవిష్కరించాం" అని పరిశోధన బృందంలోని సభ్యులు మిస్టర్ టయోటా చెప్పారు.
టచ్ మీ నాట్..
గాలి(Air)లో ఉండే సమ్మేళనాలను విశ్లేషిస్తూ, అరబిడోప్సిస్‌లో Z-3-HAL, E-2-HAL అనే రెండు సమ్మేళనాలు కాల్షియం సంకేతాలను ప్రేరేపించాయని పరిశోధకులు గుర్తించారు. "మా దృష్టి నుండి దాచబడిన ఈ అతీంద్రియ కమ్యూనికేషన్ నెట్‌వర్క్, పొరుగు మొక్కలను సకాలంలో రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది" అని పరిశోధకులు తెలిపారు. మిమోసా పుడికా (టచ్-మీ-నాట్) మొక్కలు విడుదల చేసే కాల్షియం సిగ్నల్‌లను గుర్తించడానికి బృందం ఇదే పద్ధతిని ఉపయోగించింది, ఇవి వేటాడే జంతువులను నివారించడానికి వాటి ఆకులను స్పర్శకు ప్రతిస్పందనగా త్వరగా కదిలిస్తాయని గుర్తించారు.
పరిశోధన అద్భుతం
``మొక్కలు మాట్లాడగలిగితే, అవి మాంసాహారుల (అఫిడ్స్, గొంగళి పురుగులు, కత్తెర/పురుగుమందులతో తోటల పెంపకందారులు) గురించి రసాయన సంకేతాల ద్వారా అలా మాట్లాడతాయి. మొక్కలు మాట్లాడగలవు(మనకు తెలిసినవి). కానీ జపాన్‌లోని సైతమా విశ్వవిద్యాలయంలోని పరమాణు జీవశాస్త్రవేత్తలు దీనిని వీడియోలో బంధించి ఈ పరిశోధనలను అగ్రస్థానంలో నిలబెట్టారు.`` అని హెనీ గ్రిల్ గ్రోస్(Heny Grill Grows) అభిప్రాయపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)