NASA Black Holes Video: నాసా నుంచి స్పెషల్ గిఫ్ట్- సృష్టి రహస్యం చూశారా?
NASA Black Holes Video: చాలా అరుదైన 22 బ్లాక్ హోల్స్ విజువల్స్‌ను నాసా విడుదల చేసింది. ఆ వీడియోలను మీరూ చూసేయండి.
NASA Black Holes Video: బ్లాక్ హోల్ వీక్ సందర్భంగా నాసా రేర్ ఫుటేజ్‌తో ఓ వీడియోను విడుదల చేసింది. మన గెలాక్సీ సమీపంలోని 22 బ్లాక్ హోల్స్ డేటా ద్వారా ఈ వీడియోను రూపొందించిన నాసా...గతంలో ఎన్నడూ లేనివిధంగా బ్లాక్ హోల్స్ ఫుటేజ్‌ను బయటపెట్టింది.
అద్భుతం
ప్రపంచంలో ప్రతీ విషయానికి ఒక రోజు ఉన్నట్లు...నాసాకు ఇది వీక్ ఆఫ్ బ్లాక్ హోల్ అన్నమాట. అందుకే మనం ఎవరూ ఎప్పుడు చూడని 22 బ్లాక్ హోల్స్ రేర్ విజువల్స్ ను విడుదల చేసింది నాసా. అతి ఇవన్నీ కూడా 22వేల రెట్లు స్పీడ్ పెంచి చూపించనవి వాస్తవానికి మనకు బ్లాక్ హోల్ కనపడదు. కానీ టెలిస్కోప్ తో గెలాక్సీలను, స్టార్ మూమెంట్స్ ను అబ్జర్వ్ చేస్తే బ్లాక్ హౌల్ ఐడింటిఫికేష్స్ కనిపిస్తాయి. అలా గెస్ చేసి తీసిన ఊహాచిత్రాలకు 22వేల రెట్లు స్పీడ్ పెంచితే మన భూమిని ఇలా కనిపిస్తాయన్న మాట. వీటికి సంబంధించి ఈ వీడియోలో చూపిస్తున్న వివరాలు కూడా మన సూర్యుడితో కంపేర్ చేసుకుని నాసా ఇచ్చినవే.
ఏంటీ బ్లాక్ హోల్?
అసలేంటీ ఈ బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలం అని తెలుగులో చెప్పొచ్చు. కానీ తెలుగులో ఇంగ్లీషులో చెప్పినా విజ్ఞాన శాస్త్ర ప్రపంచానికి కూడా అంతు చిక్కని ఎన్నో వింతలు జరిగే ప్రదేశం ఇది. సాధారణంగా ప్రతీ గెలాక్సీకి ఓ బ్లాక్ హోల్ సెంటర్ లో ఉంటుంది. అలా అని అది కనిపిస్తుందా అంటే లేదు. చుట్టూ ఉన్న నక్షత్రాల కదలికలను బట్టి అక్కడ బ్లాక్ హోల్ ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు.
అంతే కాదు కనీసం కాంతి కూడా బ్లాక్ హోల్ నుంచి తప్పించుకోలేదు. మన శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకూ చేసిన పరిశోధనల ఆధారంగా బ్లాక్ హోల్ అంటే మన సూర్యుడి కంటే 20 రెట్లు పెద్దవైన నక్షత్రాలు వాటి చివరిదశలో మండే గుణం కోల్పోయి బ్లాక్ హోల్స్ లోకి జారిపోతాయని అంచనా. ప్రతీసారీ ఇలానే జరగాలని లేదు.
పరిశోధన
గెలాక్సీల ఏర్పడటంలో ఈ బ్లాక్ హోల్స్ ఇంపార్టెన్స్ ఏంటా అని నాసా ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తోంది. చాలా మంది స్పేస్ అబ్జర్వర్లు టెలిస్కోపుల సహాయంతో సమీపంలోని గెలాక్సీలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. హబుల్ టెలిస్కోప్ నుంచి రీసెంట్ గా నాసా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వరకూ అన్నీ విశ్వం ఏర్పడటానికి మూలకారణాలకోసం అన్వేషిస్తున్నాయి. రేపు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అబ్జర్వేషన్స్ ఈ బ్లాక్ హోల్స్, గెలాక్సీలు వాటి నుంచి లైట్ చుట్టూనే తిరుగుతూ వాటి గుట్టును బయటపెట్టేందుకు ఉపయోగపడతాయి.