New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Maori Haka Dance In New Zealand Parliament: న్యూజిలాండ్ ఎంపీ హనా-రౌహితీ కరేరికి మైపీ-క్లార్క్ మరోసారి వైరల్ అవుతున్నారు. స్వదేశీ ఒప్పంద బిల్లును వ్యతిరేకిస్తూ హాకా డ్యాన్స్ చేశారు.
Hana Rawhiti Kareariki Maipi Clarke Maori Haka Dance: పార్లమెంట్‌లో అతి చిన్న వయస్కురాలైన ఎంపీ హనా-రౌహితీ కరేరికి మైపి క్లార్క్ హాకా డ్యాన్స్‌తో మరోసారి వైరల్ అవుతున్నారు. స్వదేశీ ఒప్పంద బిల్లు(Indigenous Treaty Bill )ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒప్పంద బిల్లు కాపీలను చించి వేస్తూ ఆమె హాకా డ్యాన్స్ చేశారు. ఆమెతోపాటు ఇతర ఎంపీలు కూడా అందుకున్నారు. దీంతో న్యూజిలాండ్ పార్లమెంట్ గురువారం వేడెక్కింది.
న్యూజిలాండ్‌లోని పార్లమెంటు సమావేశాల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒప్పంద సూత్రాల బిల్లుపై ఓటు వేయడానికి ఎంపీలు సమావేశమయ్యారు. అయితే బిల్లు కాపీని చింపి 22 ఏళ్ల ఎంపీ నిరసన స్వరాన్ని అందుకున్నారు. హాకా సంప్రదాయ మావోరీ హాకా డ్యాన్స్ చేశారు.
Also Read: మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
Meanwhile in New Zealand’s Parliament - here is what it looks like to push back and stand tall and I am here for ALL of it.
— Black Mommy Activist, PhD🎙 (@kayewhitehead) November 15, 2024
New Zealand’s parliament was briefly suspended on Thursday after Te Pati Maori MPs staged a haka (a traditional Maori dance made famous by New… pic.twitter.com/PsEHkE1qKh
హౌస్‌లోని ఉన్న ఇతర ఎంపీలు, గ్యాలరీలో ఉన్న సందర్శకులు కూడా హనా-రౌహితీ కరేరికి మైపి-క్లార్క్‌తో జత కలిశారు. హాకా డ్యాన్స్ చేశారు. దీనితో సభను స్పీకర్ గెర్రీ బ్రౌన్లీ కొద్దిసేపు నిలిపివేసారు.
ప్రభుత్వం మావోరీల మధ్య 1840లో జరిగిన వైతాంగి ఒప్పందం ప్రకారం బ్రిటీష్ వారికి పాలనను అప్పగించినందుకు బదులుగా గిరిజనులకు వారి భూములను నిలుపుకోవడానికి, ప్రయోజనాలు కాపాడుకునే హక్కు ఇచ్చారు. ఆ హక్కులు న్యూజిలాండ్ వాసులందరికీ వర్తింపజేయాలని ఇప్పుడు తీసుకొచ్చే బిల్లు సూచిస్తుంది. అందుకే దీన్ని మావోరీలు వ్యతిరేకిస్తున్నారు.
ఇంతకీ హనా-రౌహితీ కరేరికి మైపీ-క్లార్క్ ఎవరు?
హనా-రౌహితీ కరేరికి మైపి-క్లార్క్ న్యూజిలాండ్‌లో 22 ఏళ్ల ఎంపీ, పార్లమెంటులో తే పాటి మావోరీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మైపీ-క్లార్క్ న్యూజిలాండ్‌లో 2023 ఎన్నికల్లో ఎన్నికయ్యారు. పిన్నవయస్కురాలిగా అప్పట్లోనే హెడ్‌లైన్స్ అయ్యారు. అంతే కాకుండా తన తొలి ప్రసంగంలో పార్లమెంట్‌లో సాంప్రదాయ హాకాను ప్రదర్శించి వైరల్ అయ్యారు.
ఆమెతోపాటు తండ్రి కూడా ఇద్దరూ తె పాటి మావోరీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులుగా పోటీ పడ్డారు. అయితే యువతను ప్రోత్సహించాలన్న కారణంతో మైపీ-క్లార్క్ ఎంపికయ్యారు.
ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్, ఆయన ప్రభుత్వంపై మైపీ-క్లార్క్ తీవ్ర విమర్శలు చేశారు. మావోరీ హక్కులు కాలరాస్తున్నారని ఆరోపించారు. కొన్ని కఠినమైన విధానాలు కారణంగా లక్సన్ ప్రజాదరణ గణనీయంగా తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవికి అర్హులు ఎవరనే విషయంలో జరిగిన స్థానిక మీడియా సర్వేలో మైపీ-క్లార్క్ పేరు కూడా ఉంది.
ప్రస్తుతం తీసుకొచ్చే బిల్లుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ బిల్లును ఎవరూ మద్దతు తెలపకపోవడంతో అది చట్టంగా మారే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్తనాయి. జాతి వైరుధ్యాన్ని, రాజ్యాంగ తిరుగుబాటు ప్రోత్సహిస్తుందని అంటున్నారు.