అన్వేషించండి

Snow In Desert: మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !

Saudi Arabia: సౌదీ అరేబియా అంటే ఎడారి ప్రాంతం. వర్షమే అంతంతమాత్రం ఇక మంచు కూడానా. ఇప్పుడు వరదలతో పాటు మంచు కూడా అక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచేంతగా పడుతోంది.

Saudi Arabian desert covered in snow: బ్రహ్మం గారి కాలజ్ఞానం విన్నవారికి అప్పుడప్పుడూ వెలుగుచూసే చిత్రవిచిత్రాలు చూసి అప్పుడే చెప్పెను బ్రహ్మం గారూ అని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్క మన రాష్ట్రం.. మన దేశంలో మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా అలాంటి వింతలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. 

గల్ఫ్ దేశాలను మనం ఎడారి దేశాలని పిలుస్తాం. అంతా ఎడారే ఉంటుంది. ఇసుకతో నిండి ఉంటుంది. ఎండలు పేట్రేగిపోతాయి. కానీ వర్షం మాత్రం జాడ కనిపించదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. ఇటీవల పలుమార్లు ఎడారుల్లో వచ్చిన వర్షాల దాటికి వాహనాలు కూడా కొట్టుకుపోయాయన్న వార్తలు వచ్చాయి. అందరూ ఇదేం విచిత్రం అనుకున్నారు. అలాంటి వర్షం వస్తే ఎడారుల్లో ఇంత కాలం ఉన్న వారికి కాస్త రిలీఫే. ఇప్పుడు అక్కడ ఉండేవారికి మరో విచిత్రమైన వాతావరణ మార్పు కూడా కనిపిస్తోంది. అదేమిటంటే మంచు కురవడం.       

గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్

సౌదీ అరేబియా ఎడారుల్లో ఎప్పుడూ మంచు జాడే ఉండదు. మంచు కురిస్తే అసలు అది ఎడారే కాదు. కానీ ఈ సారి మాత్రం మంచు కురుస్తోంది. అది కూడా అలా ఇలా కాదు. మన కశ్మీర్‌లో మంచు కురిసి రోడ్లు ఎలా బ్లాక్ అవుతాయో అంత భారీగా కురుస్తోంది. ఈ దృశ్యాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  

వాతావరణ మార్పులు, ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రపంచంలో అనేక చోట్ల విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి గల్ఫ్ లోనూ జరుగుతున్నాయి. ఇప్పుడు మంచు కూడా అక్కడ శీతల దేశాల్లోలా మారడం మాత్రం విచిత్రంగా కనిపిస్తోంది.               

ట్రంప్‌ కంటే హారిస్‌ దగ్గరే ఎక్కువ సంపద - అంత డబ్బు ఎలా సంపాదించారు?

అయితే ఇలా ఎడారుల్లో వరదలు రావడం, మంచు తుపాన్లు రావడం వాతావరణ మార్పులకు సంకేతమని ఇది భూమి మనుగడకు ప్రమాదకర సంకేతాలని నిపుణులు అంటున్నారు. ఎడారుల్లో వరదలు, మంచు వస్తే.. ఇప్పటి వరకూ మంచు ప్రాంతాలుగా ఉన్న అంటార్కిటికా వంటివి మంచు కరిగిపోయి ఎడారులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. పర్యావరణ విధ్వంసం వల్లే ఇలాంటివి జరుగుతూంటాయని.. వీటి వల్ల వచ్చే పరిణామాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని అంటున్నారు . అందుకే ప్రపంచం ఇలాంటి వాటిని విచిత్రాలుగా కాకుండా..  ప్రమాదకర సంకేతాలుగా చూడాలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
ABP Desam Top 10, 28 April 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 April 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
IPS Ajay Pal Sharma : పశ్చిమ బెంగాల్‌ పోలీస్ అబ్జర్వర్‌గా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌! అజయ్‌పాల్ శర్మ నియామకంతో దీదీ కంచుకోట హై అలర్ట్‌!
పశ్చిమ బెంగాల్‌ పోలీస్ అబ్జర్వర్‌గా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌! అజయ్‌పాల్ శర్మ నియామకంతో దీదీ కంచుకోట హై అలర్ట్‌!
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Tips for Child Sleep : పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
Social Post : మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
KCR : కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం లేదా? - బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిప్పులు
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం లేదా? బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిప్పులు
Embed widget