అన్వేషించండి

Kamala Harris Networth: ట్రంప్‌ కంటే హారిస్‌ దగ్గరే ఎక్కువ సంపద - అంత డబ్బు ఎలా సంపాదించారు?

US Presidential Elections 2024: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సంపదలో ఎక్కువ భాగం ఆమె రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఉంది. తన భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌తో కలిసి ఆమె $8 మిలియన్ల సంపద సృష్టించారు.

How US Vice-President Kamala Harris Built Her Wealth: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రత్యర్థిగా నిలబడిన వైస్ ప్రెసిడెంట్‌ కమలా హారిస్, ట్రంప్‌నకు టఫ్‌ పైట్‌ ఇచ్చారు. ఇక్కడో విశేషం ఏంటంటే.. ట్రంప్‌ కంటే ఎక్కువ సంపద కమలా హారిస్‌ సొంతం. దశాబ్దాల రాజకీయాలు, తాను రాసిన పుస్తకాలపై వచ్చే రాయల్టీలు, పెట్టిన పెట్టుబడుల నుంచి వచ్చిన రాబడి కలగలిపి భారీ మొత్తంలో సంపదతో, ట్రంప్‌ కంటే ఎప్పుడూ చాలా ముందంజలో ఉన్నారు. ఫోర్బ్స్ (Forbes) ప్రకారం, తన భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌తో (Doug Emhoff) కలిసి ఆమె 8 మిలియన్‌ డాలర్ల సంపదకు అధిపతిగా ఉన్నారు.

హారిస్‌ సంపదలో మ్యూచువల్‌ ఫండ్స్‌ది ప్రధాన భాగం
CBS న్యూస్ రిపోర్ట్‌ ప్రకారం, కమలా హారిస్ 'ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్‌'లో దాఖలు చేసిన ఫారాల్లో తన ఆదాయం & ఆస్తులను గురించి క్రమం తప్పకుండా వెల్లడిస్తారు. ఈ ఏడాది మే నెలలో, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్, 2023 తాజా పబ్లిక్ డిస్‌క్లోజర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. అందులో, కమలా హారిస్‌ పెట్టుబడుల వివరాలన్నీ ఉన్నాయి. ప్రధానంగా, వందల కోట్ల రూపాయల విలువైన నిష్క్రియాత్మక ఇండెక్స్ ఫండ్‌లు (passive index funds) ఆమె పేరిట ఉన్నాయి. వీటితో పాటు 8 మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నాయి.  దాదాపు 1 మిలియన్‌ డాలర్ల విలువైన పెన్షన్ ప్లాన్స్‌ కూడా హారిస్‌ పేరుతో ఉన్నాయి.

వైస్ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ సంపద ప్రధానంగా ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది కాదు. వైస్ ప్రెసిడెంట్‌గా ఆమె వార్షిక జీతం దాదాపు 2,35,100 అమెరికన్‌ డాలర్లు. అదే సమయంలో సెనేటర్‌గా ఆమె సంవత్సరానికి 1,74,000 డాలర్లు సంపాదించారు. రచయిత్రిగా కమహా హారిస్‌ కెరీర్ చాలా లాభదాయకంగా సాగుతోంది, ఇప్పటివరకు ఆమె ప్రచురించిన పుస్తకాలపై రాయాల్టీల ద్వారా 5,00,000 డాలర్లు సంపాదించారు.

కమలా హారిస్‌, 2004 నుంచి 2010 వరకు, శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, ఆ పదవీకాలం ముగిసే సమయానికి ఆమె సంవత్సరానికి 2,00,000 డాలర్లు సంపాదించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ అయినప్పుడు సంవత్సరానికి 1,59,000 డాలర్లు తీసుకుంటూ తన జీతంలో కోత విధించుకున్నారు.

కుటుంబ సంపద విలువను పెంచిన భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌
హారిస్ వైస్ ప్రెసిడెంట్‌ అయ్యాక న్యాయవాద వృత్తి నుంచి తప్పుకున్నారు. దీనికిముందే, ఆమె భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ విపరీతంగా డబ్బు సంపాదించారు. దీంతో కుటుంబ ఆదాయం విలువ గణనీయంగా పెరిగింది. ఫోర్బ్స్ అంచనా వేసిన ప్రకారం, హారిస్‌ భర్త సంవత్సరానికి 1 మిలియన్‌ డాలర్లకు పైగా సంపాదించారు. అతనికి 30కి పైగా ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి, వాటిలో చాలా వరకు పాసివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి.

CBS న్యూస్ ప్రకారం, హారిస్, ఎమ్‌హాఫ్ ఇద్దరూ దాదాపు 8,50,000 డాలర్ల సంపదను అధికారికంగా వెల్లడించారు. దీనికి అదనంగా, ఈ జంటకు 2.9 మిలియన్‌ డాలర్ల నుంచి 6.6 మిలియన్‌ డాలర్ల మధ్య రిటైర్‌మెంట్ ఫండ్‌లు, నగదు నిల్వలు, ఇతర పెట్టుబడులు ఉన్నట్లు రిపోర్ట్‌లో ఉంది.

హారిస్‌-ఎమ్‌హాఫ్‌ ప్రధాన సంపదన లాస్ ఏంజిల్స్ ఆస్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ జంట 2012లో 1 మిలియన్‌ డాలర్లకు దానిని కొనుగోలు చేసింది. మార్కెట్‌ ప్రకారం, ప్రస్తుతం, ఆ ఆస్తి విలువ 4.4 మిలియన్‌ డాలర్లకు పెరిగింది.

మరో ఆసక్తికర కథనం: బిలియన్ డాలర్ల ఆస్తులు, కోట్ల విలువైన కార్లు - డొనాల్డ్ ట్రంప్‌ సంపద ఎంతో తెలుసా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Embed widget