అన్వేషించండి

Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు

Padi Kaushik Reddy Latest News: పోలీసులను దూషించారన్న కేసులో పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఉదయం అరెస్టు చేశారు.

Padi Kaushik Reddy News: పోలీసులను దూషించిన కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. తను దూషించారని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై కేసు పెట్టిన పోలీసులు ఈ ుదయం అదుపులోకి తీసుకున్నారు. 

బంజారాహిల్స్‌లో పోలీసులను దూషించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రుబాబు చేశారని ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయన్ని ఎప్పుడైనా అరెస్టుచేస్తారన్న అనుమానంతో బీఆర్‌ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఇంకా బీఆర్‌ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్నందున ఆయన్నే అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని పటిష్ట భద్రత మధ్య పోలీస్ వాహనంలో తరలించారు. 

హరీష్‌రావుపై రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ నేతలు కొందరు విమర్శలు చేస్తుంటే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం తన ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించారు. 

సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ తన ఫోన్ ట్యాప్ చేసి ట్రాక్ చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై ఫిర్యాదు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోయనట్టు సిబ్బంది చెప్పారు. తనను మూడు గంటలకు రమ్మని చెప్పి వెళ్లిపోవడం ఏంటని సిబ్బందిపై ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి 

ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు తీసుకోవాలని అక్కడే ఉన్న సీఐకి చెప్పారు. ఫిర్యాదు తీసుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో కౌశిక్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఎవరో వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారని... తను ఎమ్మెల్యేగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా అని ప్రశ్నించారు. 

బీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి స్టేషన్‌కు వచ్చి రుబాబు చేశారని బెదిరించారని ఆరోపిస్తూ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కౌశిక్‌రెడ్డిని A1గా చేస్తూ కేసు నమోదుచేశారు. ఆయనతోపాటు మరో ఇరవై మందిపై కూడా కేసులు కట్టారు.

Also Read: మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కౌశిక్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్, హరీష్‌ ఆగ్రహం

అక్రమ అరెస్టు, ప్రభుత్వ తీరు పట్ల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నా పై, బి ఆర్ ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. రేవంత్‌రెడ్డీ నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది.' అని వార్నింగ్ ఇచ్చారు. 

కౌశిక్ సహా ఇతర నేతల అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు." ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు! పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు ! పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు ! గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ! ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు ! ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు ! ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు ! ప్రజలపై కేసులు ప్రజాప్రతినిధులపై కేసులు కేసులు .. కేసులు .. కేసులు కాసులు మీకు - కేసులు మాకు సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు  మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితోపాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి" అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ...

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget