అన్వేషించండి

Elon Musk Net Worth 2026:తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!

Elon Musk Net Worth 2026:స్పేస్ ఎక్స్‌ ఐపీఓ విజయంతో ఎలాన్ మస్క్ సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది అదానీ, కంటే 8 రెట్లు, అంబానీ కంటే పది రెట్లు ఎక్కువ. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్పేస్‌ఎక్స్‌ నాస్డాక్‌లోకి అడుగుపెట్టడంతో ఎలాన్ మస్క్‌ సంపద పెరిగింది.
  • మస్క్‌ సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది.
  • భారత కుబేరులు అదానీ, అంబానీల కంటే 9-10 రెట్లు ఎక్కువ.
  • ఈ సంపద భారత్‌ జీడీపీలో నాలుగో వంతుకు సమానం.
  • స్పేస్ ఎక్స్ నాస్డాక్‌  లిస్టింగ్ తర్వాత ఎలాన్ మస్క్ నిరక ఆస్తుల విలువ 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 
  • భారత అపర కోటీశ్వరులు గౌతమ్ అదానీ సంపద కంటే ఇది 9 రెట్లు, ముకేష్ అంబానీ కంటే పది రెట్లు ఎక్కువ 
  • మస్క్ సంపద ప్రస్తుతం భారత్ జీడీపీలో దాదాపు నాలుగో వంతుకు సమానం. 

Elon Musk Net Worth 2026:ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మరో చరిత్ర సృష్టించారు. తన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్‌లో అడుగు పెట్టిన వేళ, ఆయన సంపద ఊహకందని స్థాయిలో పెరిగింది. నాస్డాక్‌  మార్కెట్‌లో స్పేస్‌ ఎక్స్‌ షేర్లు రికార్డు స్థాయి ధర వద్ద ముగిశాయి. దీంతో మస్క్ నికర ఆస్తి విలువ ఇప్పుడు ఏకంగా 1.1ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది. ఈ భారీ సంపదతో భారతీయ వ్యాపార దిగ్గజాలు గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీలతో పోలిస్తే మస్క్‌ ఎంతో ఎత్తులో నిలిచారు. ఈ గ్యాప్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌ అయ్యింది. 

స్పేస్‌ ఎక్స్‌ సృష్టించిన ప్రభంజనం

జూన్ 12 స్పేస్ ఎక్స్ సంస్థ నాస్డాక్‌ మార్కెట్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఐపీఓ ధర 135 డాలర్లు కాగా, తొలి రోజే షేరు 160.95 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజులోనే స్టాక్ విలువ ఇరవై శాతం పెరగడంతో స్పేస్ ఎక్స్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ 2.1 ట్రలియన్ డాలర్లను దాటిపోయింది. ఇది  మస్క్‌ వ్యక్తిగత సంపదను అమాంతం పెంచేసింది. కేవలం టెస్లా మాత్రమేకాదు, ఇప్పుడు స్పేస్ ఎక్స్ కూడా మస్క్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా మార్చింది. 

అదానీ, అంబానీతో పోలిక 

ప్రస్తుత అంచనాల ప్రకారం, అదానీ గ్రూప్‌ చైర్మన్ గౌతమ్ అదానీ నికర ఆస్తి విలువ సుమారు  12.55 లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంపద సుమారు 9.40‌ లక్షల కోట్లుగా నమోదైంది.  అయితే మస్క్‌ వద్ద ఉన్న 1.1 ట్రిలియన్‌ల సంపదతో పోలిస్తే ఆయన అదానీ కంటే 8 రెట్లు, అంబానీ కంటే పది రెట్లు ఎక్కువ సంపన్నవంతుడిగా నిలిచాడు. 

మస్క్ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ దేశ నామినల్ జీడీపీ సుమారు 4.15 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. అంటే భారత్‌ ఒక డాదిలో ఉత్పత్తి చేసే మొత్తం వస్తు సేవల్లో నాలుగో వంతు విలువ ఒక్క మస్క్‌ ఆస్తికే సమానం. ఇది ఒక వ్యక్తిగత సామ్రాజ్యానికి ఉన్న పట్టును చూపుతుంది. భారత్‌లోని అతి పెద్ద కంపెనీలైన రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఎయిటెల్‌ వంటి సంస్థల మొత్తం మార్కెట్‌ విలువను కలిపినా మస్క్‌ సంపద ముందు తక్కువే.   

ఎలాన్ మస్క్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. అంతరిక్ష రంగంలో ఆయన వేస్తున్న అడుగులు భూమిపై సంపద వర్షం కురిపిస్తున్నాయి.                  

Frequently Asked Questions

స్పేస్ ఎక్స్ నాస్‌డాక్ లిస్టింగ్ తర్వాత ఎలాన్ మస్క్ సంపద ఎంతకు చేరింది?

స్పేస్ ఎక్స్ నాస్‌డాక్ లిస్టింగ్ తర్వాత ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. షేర్లు రికార్డు స్థాయి ధర వద్ద ముగియడంతో ఇది సాధ్యమైంది.

భారతీయ కుబేరులతో పోలిస్తే ఎలాన్ మస్క్ సంపద ఎంత ఎక్కువగా ఉంది?

ఎలాన్ మస్క్ సంపద గౌతమ్ అదానీ సంపద కంటే 8 రెట్లు, ముకేష్ అంబానీ సంపద కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ భారీ అంతరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయ్యింది.

ఎలాన్ మస్క్ సంపదను భారత్ జీడీపీతో పోలిస్తే ఎలా ఉంటుంది?

ఎలాన్ మస్క్ సంపద ప్రస్తుతం భారత్ జీడీపీలో దాదాపు నాలుగో వంతుకు సమానం. భారత్ ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసే మొత్తం వస్తు సేవల్లో నాలుగో వంతు విలువ ఇది.

స్పేస్ ఎక్స్ నాస్‌డాక్ లిస్టింగ్ తొలి రోజు దాని షేర్ల పనితీరు ఎలా ఉంది?

స్పేస్ ఎక్స్ ఐపీఓ ధర 135 డాలర్లు కాగా, తొలి రోజే షేరు 160.95 వద్ద ముగిసింది. ఇది ఒక్క రోజులోనే షేరు విలువను ఇరవై శాతం పెంచి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.1 ట్రలియన్ డాలర్లకు చేర్చింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
United States IRAN War: 'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget