అన్వేషించండి

ఆ చెట్టు ముందు మనిషి నిల్చుంటే చీమలా కనిపిస్తాడు- ఇదే కాదు ఇలాంటి ఎన్నో వింతలు ఈ భూమి మీద ఉన్నాయి

Large Things On Earth: భూమ్మీద మనిషి కంటే పెద్దవి ఎన్నో ఉన్నాయి. సైజ్ పరంగానూ కొన్ని ఈ ప్రకృతిలో మనిషి ఊహకందనంత ఎత్తులో ఎదిగి ఆశ్చర్యపరుస్తున్నాయి.

What Are The Largest Things On Earth: భూమ్మీద మనిషి కంటే పెద్దవి ఎన్నో ఉన్నాయి. సైజ్ పరంగానూ కొన్ని ఈ ప్రకృతిలో మనిషి ఊహకందనంత ఎత్తులో ఎదిగి ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి కొన్ని విచిత్రాల గురించి తెలుసుకుందామా!

సాధారణంగా మనిషి ఎత్తు 5 అడుగుల తొమ్మిది అంగులాలు మించదు. అలా కాకుండా 250 అడుగుల ఎత్తైన చెట్టు, గుహలైతే 5.25 మిలియన్ క్యూబిక్ ఫీట్ల పరిమాణంతో కనపడితే ఆశ్చర్యపోకుండా ఉండగలమా? ఇట్లా భూమ్మీద ఎంతో అసాధారణంగా ఎత్తైన, లోతైన, బరువైన వాటి గురించి తెలుసుకుంటుంటే వీటన్నింటి ముందు మనిషి జీవితం చాలా చిన్నది కదా అనిపించక మానదు. 

ప్రపంచంలోనే ఎత్తైన చెట్టు

సికోయా జాతికి చెందిన చెట్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. వీటి ఎత్తు 250 అడుగులు. 26 అడుగుల వెడల్పుతో పెరుగుతాయి. ఇవి సియెరా నెవడా పర్వత ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్టు ముందు నిలుచుంటే మనిషి చీమలా కనిపిస్తాడు. సికోయా జాతికి చెందిన కొన్ని మొక్కలు దాదాపు 3000 సంవత్సరాల వరకు బతుకుతాయి!

పనసకాయ

పండ్ల జాతిలోనే అత్యంత పెద్ద చెట్టు పనస చెట్టు. ఒక్కో కాయ 120 పౌండ్ల వరకు ఉంటుంది. ఒక్కో చెట్టు సంవత్సరానికి 200 నుంచి 500 కాయల వరకు ఇస్తుంది. ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పనసకాయను, దీనిపైన పొట్టును కూడా కూర చేసుకుంటారు. పనసకాయను శాకాహారుల మాంసంగా భావిస్తారు. పనసను మించిన పెద్ద ఫ్రూట్ మరేదీ లేదు.

ఈ పక్షి ఎత్తు ముందు మనిషి దిగదుడుపే

ఇప్పుడు ప్రపంచంలో ఎత్తైన పక్షి ఏది అంటే ఆస్ట్రిచ్ అని చెప్తాం కానీ 60 లక్షల సంవత్సరాల కిందట 11 అడుగుల ఎత్తులో 12 అడుగుల పొడవు రెక్కలతో పక్షులు ఉండేవట! నమ్మశక్యంగా లేదు కదా!! అర్జెంటేవిస్ అనే పేరు గల ఈ పక్షులు అర్జెంటీనాలో ఉండేవట. వాటి ఆహారాన్ని ఈ పక్షులు గాలిలో ఉండే సంపాదించుకోగలిగేవి. వీటి గుడ్లు మాత్రం ఆస్ట్రిచ్ పక్షి గుడ్ల కంటే చిన్నవట.

అత్యంత పొడవైన ఎడారి సహారా కాదట!

అతి పెద్ద ఎడారి ఏదంటే సహారా ఎడారి అని పిల్లల్ని అడిగినా చెప్తారు కానీ నాసా ప్రకారం అత్యంత పొడవైన ఎడారి అంటార్కిటికా ఎడారి. ఎందుకంటే ఇక్కడ వానలు కురవవు. మంచూ పడదు. 5.5 మిలియన్ స్కేర్ మైళ్ల పరిధిలో ఉన్న ఎడారిని దాటడానికి మనిషి జీవితకాలం సరిపోదు.

ఈ పూవు అంత సున్నితం కాదు

పూలంటే వేలి మొనలతో పట్టుకునేంత తేలికగా, సున్నితంగా ఉండాలి కానీ 15 పౌండ్ల బరువున్న పూవును ఎప్పుడైనా చూసారా? ఇది ఇండోనేషియా అడవుల్లో కనిపించే రఫ్లేసియా అర్నోల్డీ మొక్క. పేరుకు మొక్కే కానీ అసలు దీనికి కాండాలు, కొమ్మలు ఏమీ ఉండవు. కేవలం పువ్వు మాత్రమే ఉంటుంది. దీని వాసన కూడా పాడయిపోయిన మాంసంలా ఉంటుంది. అందువల్ల చిన్న పురుగులు వచ్చి వాలినపుడు అవే ఈ ఫ్లవర్ కు ఆహారంగా మారుతాయి.

ఆకాశమంత ఎత్తైన ఇల్లు మన ఇండియాలోనే

4 లక్షల స్క్వేర్ ఫీట్ల ఎత్తులో ఉన్న అతి పెద్ద బిల్డింగ్ ఇండియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీది. ఈ ఇంటి గ్యారేజ్‌లో 168 కార్లు పడుతాయి. ఇంట్లో 50 సీట్లతో థియేటర్ కూడా ఉందట. అత్యంత అధునాతన వసతులతోపాటు హై స్పీడ్ ఎలివేటర్లు చెప్పుకోదగ్గవి. 

టాప్ హెడ్ లైన్స్

Nepal Floods: నేపాల్‌ను పొంచి ఉన్న ముప్పు! 47 హిమానీనదాలు ఉప్పొంగుతాయా?
నేపాల్‌ను పొంచి ఉన్న ముప్పు! 47 హిమానీనదాలు ఉప్పొంగుతాయా?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Nepal Floods Video: నేపాల్‌లో వరద బీభత్సం CCTV వీడియో.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన ప్రజలు
నేపాల్‌లో వరద బీభత్సం CCTV వీడియో.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన ప్రజలు
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
Viral News: జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Kidney Disease : కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Happy Raksha Bandhan 2026 : రాఖీ పండుగ శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు పంపేందుకు బెస్ట్ రక్షాబంధన్ విషెస్ ఫోటోలతో సహా
రాఖీ పండుగ శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు పంపేందుకు బెస్ట్ రక్షాబంధన్ విషెస్ ఫోటోలతో సహా
Embed widget