అన్వేషించండి

Israel Iran War: ఇరాక్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు- మధ్యప్రాచ్యంలో టెన్షన్ టెన్షన్

Israel Iran War: ఇన్ని రోజులు కవ్విస్తూ వస్తున్న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడికి తిగింది. ఈ ఉదయం వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Israel Launched Airstrikes On Iran : మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ధవాతావరణం కనిపిస్తోంది. అక్టోబరు 1న జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరాన్‌లోని సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులు చేసింది. 

ఇన్ని రోజులు శత్రుసంహారం కోసం సిరియా, లెనాన్‌పై దాడి చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు టార్గెట్ మార్చింది. ఇజ్రాయెల్‌కు థ్రెట్‌గా భావించే హమాస్‌, హిజ్బుల్లా సంస్థల్లోని కీలక నేతలను మట్టుబెట్టింది. ఇప్పుడు తమను కవ్విస్తూ ఇన్ని రోజులు దాడులు చేస్తున్న ఇరాన్‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా తొలిదాడిని శనివారం ప్రారంభించింది. 

ఏడాది క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హమాస్ జరిపిన దాడికి ప్రతిగా ఇజ్రాయెల్‌ దాడి చేస్తూ కొన్ని నెలలుగా విధ్వంసానికి దిగింది. ఈ దాడిలో లెబనాన్‌కు ఇరాన్ సహాయం చేసింది. అందుకే ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. 

ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై కచ్చితంగా దాడులు జరుగుతున్నాయని  ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఏమన్నరంటే... "ఇరాన్‌లోని అధికారులు, వాళ్లకు వంతపాడే సంస్థలు, వ్యక్తులు, దేశాలు అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్‌పై కనికరం లేకుండా దాడి చేస్తున్నాయి."

"ప్రపంచంలోని ప్రతి ఇతర సార్వభౌమ దేశం మాదిరిగానే , ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, తమను తాము రక్షించుకునే బాధ్యత ఉంది", అని చెప్పారు.

తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పేలుళ్లు నగరానికి చుట్టుపక్కల ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి వచ్చాయని అధికార మీడియా మొదట నివేదించింది.

BBC ప్రకారం దాడులు ఏ స్థాయిలో జరిగాయి, కచ్చితమైన లక్ష్యాలు ఏంటని ఇప్పటివరకు తెలియలేదు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం... ఏడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఇది చుట్టుపక్కల ప్రాంతాలను షేక్ చేసిందని టెహ్రాన్ నివాసి ఒకరు  చెప్పినట్టు రిపోర్ట్ చేసింది. 

ఇలా దాడులు జరిగాయన్న వార్తలు వెలువడటంతో అంతర్జాతీయ విమానాలను ఆయా విమానయాన సంస్థలు దారి మళ్లించాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం ఈ దాడి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఏం జరుగుతుందో చెప్పేందుకు నిరాకరిస్తోంది. అసలు ఏం జరగలేదని చెప్పేందుకు టెహ్రాన్‌లోని కూరగాయల మార్కెట్‌లో పురుషులు ట్రక్కులు లోడ్ చేస్తున్న ఫుటేజీగా విడుదల చేసింది. 

ఏమైనా సిరియాకు చెందిన వార్తా సంస్థ SANA నివేదిక ప్రకారం..."ఆక్రమిత సిరియన్ గోలన్, లెబనీస్ భూభాగాల నుంచి క్షిపణుల బారేజీలు సిరియాలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లోని కొన్ని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి" అని తెలిపింది. సిరియా వైమానిక దళం కొన్ని క్షిపణులను ఇరాన్ కూల్చివేసిందని పేర్కొంది. 

మొదట ఏం లేదని చెప్పిన ఇరాన్ తరువాత దాడిని ధ్రువీకరించింది. టెహ్రాన్‌లో ఐదు పేలుళ్లు జరిగినట్టు వెల్లడించింది. CNN ప్రకారం... దాడి ప్రారంభమైన తర్వాత ఈ పేలుళ్లలతో ఆకాశాన్ని ప్రకాశవంతమైంది. ఈ దాడులు పెరిగే అవకాశం లేకపోదనే వాదన బలంగా వినిపిస్తోంది. 

Also Read: దేశం నుంచి వెళ్లగొట్టారు కానీ రాజీనామా లేఖ మర్చిపోయారు - ఇప్పటికీ బంగ్లాదేశ్ అధ్యక్షురాలు హసీనానేనా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Embed widget